షాకింగ్.. స్టార్ కమెడియన్ సునీల్‌కు అస్వస్తత..

టాలీవుడ్ టాప్ కమెడియన్ కమ్ హీరో సునీల్ అస్వస్తతకు లోనయ్యాడు. ఈయన కొన్ని రోజులుగా వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగా కాస్త బ్రేక్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 23, 2020, 12:14 PM IST
షాకింగ్.. స్టార్ కమెడియన్ సునీల్‌కు అస్వస్తత..
సునీల్ కమెడియన్
  • Share this:
టాలీవుడ్ టాప్ కమెడియన్ కమ్ హీరో సునీల్ అస్వస్తతకు లోనయ్యాడు. ఈయన కొన్ని రోజులుగా వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ కమెడియన్‌గా సినిమాలు చేసుకుంటున్నాడు సునీల్. ఈ మధ్య వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మొన్నటి వరకు కూడా ఆరోగ్యంగానే ఉన్న ఈయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు వెంటనే మాదాపూర్‌లోని ఏ.ఐ.జి ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా ఈయన గొంతు, లివర్ సమస్యతో బాధ పడుతున్నాడు.

Tollywood Top Comedian Sunil hospitalized due to throat and liver relative issues pk టాలీవుడ్ టాప్ కమెడియన్ కమ్ హీరో సునీల్ అస్వస్తతకు లోనయ్యాడు. ఈయన కొన్ని రోజులుగా వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగా కాస్త బ్రేక్.. Comedian Sunil,Comedian Sunil twitter,Comedian Sunil varma twitter,Comedian Sunil illness,Comedian Sunil hospital,Comedian Sunil hospitalized,Comedian Sunil liver issues,Comedian Sunil throat issues,sunil comedy scenes,sunil movies,telugu cinema,కమెడియన్ సునీల్,కమెడియన్ సునీల్‌కు అస్వస్తత,లివర్ సమస్యతో బాధ పడుతున్న సునీల్
సునీల్ ఫేస్‌బుక్ ఫోటో


అక్కడే రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు సునీల్. అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదు. కొన్ని రోజులుగా సునీల్ మైనర్ లివర్ సమస్యతో బాధ పడుతున్నాడని.. అయితే దాంతో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఐ మెడికేషన్‌లో ఉన్నాడు సునీల్. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కలర్ ఫోటో అనే సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: January 23, 2020, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading