రష్మీ గౌతమ్‌తో శేఖర్ మాస్టర్ రొమాన్స్.. జబర్దస్త్ కాంబినేషన్‌కు అంతా సిద్ధం..

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందర్నీ తన స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్నాడు ఈయన. శేఖర్ హీరోగా వస్తే బాగుంటుందని చాలా రోజులుగా అభిమానులు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2019, 1:51 PM IST
రష్మీ గౌతమ్‌తో శేఖర్ మాస్టర్ రొమాన్స్.. జబర్దస్త్ కాంబినేషన్‌కు అంతా సిద్ధం..
శేఖర్ మాస్టర్ రష్మీ గౌతమ్
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందర్నీ తన స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్నాడు ఈయన. శేఖర్ హీరోగా వస్తే బాగుంటుందని చాలా రోజులుగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతానికి కొరియోగ్రఫీ మాత్రమే కావాలంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ హీరోగా రాబోతున్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతుంది. దానికితోడు అదిరిపోయే హీరోయిన్‌తో వస్తున్నాడు ఈయన. శేఖర్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్న ఆ ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
Tollywood top choreographer Sekhar Master turns hero and he will romance with Jabardasth anchor Rashmi Gautam pk తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందర్నీ తన స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్నాడు ఈయన. శేఖర్ హీరోగా వస్తే బాగుంటుందని చాలా రోజులుగా అభిమానులు.. sekhar master,rashmi gautam,rashmi gautam sekhar master,jabardasth anchor rashmi gautam,sekhar master turns hero,rashmi gautam sekhar master movie,rashmi gautam sekhar master dance,dhee champions rashmi gautam,dhee champions sekhar master,sekhar master movies,rashmi gautam movies,rashmi gautam dance,jabardasth comedy show,telugu cinema,రష్మీ గౌతమ్,శేఖర్ మాస్టర్,శేఖర్ మాస్టర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,ఢీ ఛాంపియన్స్,హీరోగా శేఖర్ మాస్టర్
శేఖర్ మాస్టర్ రష్మీ గౌతమ్

ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు బుల్లితెరపై అదిరిపోయే ఇమేజ్ ఉంది. ఢీ ఛాంపియన్స్‌తో పాటు మరిన్ని షోల్లో కూడా రష్మీ, శేఖర్ మాస్టర్ జోడీ ఆకట్టుకుంటుంది. దాంతో ఇప్పుడు ఈయన్ని హీరోగా పరిచయం చేయబోతున్న సినిమాలో ఈమెనే హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుదేవా, లారెన్స్ లాంటి వాళ్లు డాన్సర్, కొరియోగ్రఫర్, డైరెక్టర్ నుంచి హీరోలుగా మారి సత్తా చూపించారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా ఇదే చేయాలనుకుంటున్నాడు.
Tollywood top choreographer Sekhar Master turns hero and he will romance with Jabardasth anchor Rashmi Gautam pk తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందర్నీ తన స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్నాడు ఈయన. శేఖర్ హీరోగా వస్తే బాగుంటుందని చాలా రోజులుగా అభిమానులు.. sekhar master,rashmi gautam,rashmi gautam sekhar master,jabardasth anchor rashmi gautam,sekhar master turns hero,rashmi gautam sekhar master movie,rashmi gautam sekhar master dance,dhee champions rashmi gautam,dhee champions sekhar master,sekhar master movies,rashmi gautam movies,rashmi gautam dance,jabardasth comedy show,telugu cinema,రష్మీ గౌతమ్,శేఖర్ మాస్టర్,శేఖర్ మాస్టర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,ఢీ ఛాంపియన్స్,హీరోగా శేఖర్ మాస్టర్
శేఖర్ మాస్టర్ రష్మీ గౌతమ్

ఇక రష్మీకి కూడా శేఖర్ మాస్టర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి పెద్దగా ఇబ్బందులేం లేనట్లే కనిపిస్తుంది. గతంలో గుంటూరు టాకీస్, అంతం లాంటి చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అనుభవం రష్మీ సొంతం. అయితే పెద్దగా విజయాలు మాత్రం అందుకోలేదు. కేవలం అందాల ఆరబోతకే సరిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ సినిమాలో మాత్రం మంచి పాత్రే వస్తుందని ఆశిస్తుంది జబర్దస్త్ యాంకర్. శేఖర్ మాస్టర్‌కు ఇమేజ్ బాగానే ఉంది కాబట్టి ఆయన్న హీరోగా పరిచయం చేయడానికి నిర్మాతలు కూడా బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. మరి చూడాలిక.. ఈయన వెండితెరపై నటుడిగా ఎంతవరకు ఆకట్టుకుంటాడో..?
First published: December 2, 2019, 1:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading