మూన్నెళ్ళ తర్వాత మరోసారి యాంకర్స్ అంతా బిజీ అయిపోయారు. సీనియర్ యాంకర్స్ సుమ కనకాల, రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్ మేకప్ వేసుకున్నారు. చాలా రోజులుగా కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా వీళ్లంతా ఇంటికే పరిమితం అయిపోయారు. అక్కడే ఉండి విభిన్నమైన కాన్సెప్టులు ట్రై చేసారు. వీడియో కాల్స్ నుంచే కావాల్సినంత వినోదాన్ని పంచి ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. చాలా రోజుల తర్వాత షూటింగ్ మొదలు కావడంతో అంతా మేకప్ వేసుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటున్నారు.
సుమ కనకాలతో పాటు మరో యాంకర్ అనసూయ కూడా చాలా రోజుల తర్వాత షూటింగ్‌కు రావడంతో అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వారం నుంచి జబర్దస్త్ కామెడీ షోతో పాటు అదిరింది, క్యాష్ లాంటి కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. పూర్తి జాగ్రత్తలతో కరోనా రాకుండానే ఈ షూటింగ్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే జబర్దస్త్ షూటింగ్ రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైంది. మిగిలిన సీరియల్స్ కూడా సారథితో పాటు మిగిలిన స్టూడియోస్‌లో జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Anchor suma, Rashmi Gautam, Telugu Cinema, Tollywood