అనసూయ, రష్మి, సుమ అంతా కలిసి లాక్‌డౌన్‌లో అలా..

సుమక్క సూపర్ 4 స్పెషల్ ఎపిసోడ్ (sumakka super 4)

Tollywood anchors: ఎప్పుడూ బిజీగా ఉండే యాంకర్స్ కూడా ఇప్పుడు ఖాళీ అయిపోయారు. మరోవైపు ఆడియన్స్ కూడా తమకు ఎవరు ఎంటర్‌టైన్మెంట్ ఇస్తారా అని చూస్తున్నారు.

 • Share this:
  లాక్ డౌన్ కారణంగా అన్ని ఆగిపోయాయి.. ఓ రకంగా చెప్పాలంటే స్తంభించిపోయాయి. దాంతో ఎంటర్‌టైన్మెంట్ కూడా లోపించిందిప్పుడు. ఎప్పుడూ బిజీగా ఉండే యాంకర్స్ కూడా ఇప్పుడు ఖాళీ అయిపోయారు. మరోవైపు ఆడియన్స్ కూడా తమకు ఎవరు ఎంటర్‌టైన్మెంట్ ఇస్తారా అని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లోనే ఉండి ప్రయోగాలు చేస్తున్నారు. మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. టాలీవుడ్ టాప్ యాంకర్స్ అంతా కలిసి అభిమానుల కోసం తమ వంతుగా కొత్త ప్రయోగాలతో వినోదం అందించాలని చూస్తున్నారు.

  ఇందులో యాంకర్ సుమ టీం లీడర్.. ఆమెతో పాటు జబర్దస్త్ ఫేమ్ అనసూయ, రష్మీ గౌతమ్ కూడా ఉన్నారు. ఇక మేల్ యాంకర్స్‌లో రప్ఫాడించే రవి, ప్రదీప్ కూడా వీళ్లతో జత కలిసారు. అంతా కలిసి చిన్నపాటి ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్ ప్లాన్ చేసారు. దీనికి సుమక్క సూపర్ 4 అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ ఎపిసోడ్ ఎంతో ఇష్టపడి ఇంట్లోనే ఉండి ఆడియన్స్ కోసం సిద్ధం చేసామని చెబుతున్నారు వీళ్లు. రకుల్ ప్రీత్ సింగ్ బండ్లో పెట్రోల్ ఎంత పోసుకుంది దగ్గర్నుంచి వంకాయల వరకు వచ్చిందిరా నీ బతుకు అంటూ రవి పంచ్ కూడా వేసాడు ప్రదీప్‌పై.

  ఇలాంటి పంచులు ఎపిసోడ్‌లో ఇంకా ఫుల్ ఉండబోతున్నాయి. ఈ వీడియోను కోవిడ్ చారిటీకు అంకితం ఇస్తున్నామని సుమ చెప్పింది. ఇక ఈ వీడియో కోసం కష్టపడిన తన తోటి యాంకర్స్ ప్రదీప్, రవి, అనసూయ, రష్మి గౌతమ్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పింది సుమ. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను ఎప్రిల్ 18 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
  Published by:Praveen Kumar Vadla
  First published: