TOLLYWOOD TOP ANCHOR SUMA KANAKALA SHARED HER OLD PHOTOS IN INSTAGRAM PK
Suma Kanakala: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. మాయ చేస్తున్న సుమ కనకాల వింటేజ్ ఫోటోలు..
యాంకర్ సుమ (suma kanakala)
Suma Kanakala: సుమ కనకాల.. పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఈమెను ఫీల్ అవుతుంటారు..
సుమ కనకాల.. పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఈమెను ఫీల్ అవుతుంటారు అంతా. సుమ కూడా అలాగే అందరిని నవ్విస్తుంటుంది. సరదాగా ఉంటుంది కాబట్టే ఇప్పటి వరకు ఈమెకు తిరుగులేదు.. ఈమె లాంటి యాంకర్ మళ్లీ తెలుగులో వస్తుందా రాదా అనేది కూడా అనుమానమే. ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాల ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. ఝాన్సీ, ఉదయభాను లాంటి వాళ్లు యాంకర్లుగా ఉన్నపుడు సుమ సినిమాలతో బిజీగా ఉంది.. మధ్యలో కొన్ని సీరియల్స్ కూడా చేసింది. అప్పట్లో దిగిన ఫొటోషూట్ ఇప్పుడు ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ మధ్య తన సోషల్ మీడియా పేజీలో అభిమానులతో పంచుకుంది సుమ. పెళ్లికి ముందు.. సీరియల్స్ చేసే సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసింది ఈ సీనియర్ యాంకర్. దాంతో పాటు మరికొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది సుమ. అందులో ఒకటి స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఫోటో కూడా ఉంది. కింద కూర్చుని వినయంగా నమస్కారం చేస్తున్నది ఒకటి అయితే.. మరొకటి సింపుల్‌గా నవ్వుతూ ఉన్న ఫోటో. ఈ రెండింట్లోనూ అందులో చాలా అందంగా.. హీరోయిన్ మాదిరే ఉంది సుమ.
అప్పట్లో చాలా సినిమాలలో సుమకు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఆమెకు మాత్రం హీారోయిన్ అవ్వాలని.. స్టార్ అయిపోవాలనే ఆలోచన లేదు. అందుకే కొన్ని మంచి అవకాశాలు వచ్చినా కూడా కేవలం సీరియల్స్ వైపు అడుగులేసింది. దాంతో పాటు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది సుమ కనకాల.
నిజానికి అప్పట్లో 1996లో దాసరి తెరకెక్కించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్గా నటించింది కూడా. ఆ తర్వాత సీరియల్స్.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది. ఈమె పాత ఫోటోను చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.