TOLLYWOOD TOP ANCHOR SUMA KANAKALA JAYAMMA PANCHAYATHI TITLE SONG RELEASED BY RAJAMOULI PK
Jayamma Panchayathi title song: ‘జయమ్మ పంచాయితీ’ టైటిల్ సాంగ్.. ఊరంత గడుసుతనం..
జయమ్మ పంచాయితీ టైటిల్ సాంగ్ (Jayamma Panchayathi)
Jayamma Panchayathi title song: తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా ఆరేళ్ళ బుడ్డోడు నుంచి 60 ఏళ్ళ తాత వరకు అంతా చెప్పేది ఒక్కటే మాట.. సుమ కనకాల (Jayamma Panchayathi title song). బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా ఏలేస్తుంది సుమ.
తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా ఆరేళ్ళ బుడ్డోడు నుంచి 60 ఏళ్ళ తాత వరకు అంతా చెప్పేది ఒక్కటే మాట.. సుమ కనకాల. బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా ఏలేస్తుంది సుమ. మరీ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు ఈమె చాలా చేరువైపోయింది. సుమ హోస్టింగ్ చేస్తుందటే చాలు.. వెంటనే టీవీల ముందు అతుక్కుపోయే లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఈమెకు. మరోవైపు సినిమా వేడుకలకు కూడా ఇప్పుడు సుమను మించిన ఆప్షన్ లేదు. రెమ్యునరేషన్ లక్షల్లో ఉన్నా కూడా నిర్మాతలు ఈమె కోసమే ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే సుమ యాంకరింగ్ చేసిందంటే సినిమా ఫంక్షన్ హిట్ అంతే. సుమ లేని వేడుక చూడలేం అనేస్తున్నారంటే తెలుగు ఆడియన్స్‌కు సుమ ఎంతగా అలవాటైపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్నేళ్లూ బుల్లితెరపైనే సందడి చేసిన ఈమె.. ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. నిజానికి కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత.. తన దారి బుల్లితెర అని తెలుసుకుని ఇటు వైపు వచ్చి సక్సెస్ అయింది సుమ. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత ‘జయమ్మ పంచాయితీ’ టైటిల్‌తో ఓ సినిమాలో నటిస్తుంది సుమ.
ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్‌గా పూర్తి చేసారు. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదలైంది. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. ఇందులో సుమ చాలా ఈజ్‌తో కనిపిస్తుంది. కామిక్ టైమింగ్‌తో పాటు ఊరిలో ఉండే గయ్యాలిగా కనిపించింది జయమ్మ. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సుమ మినహా దాదాపు అంతా కొత్త వాళ్ళతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. టైటిల్ అనౌన్స్ చేసిన రోజు నుంచే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. విజయ్ కలివారపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా సుమ కెరీర్‌కు బాగా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు అభిమానులు. పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా జయమ్మ పంచాయితీ వస్తుంది.
ఈ సినిమా కోసమే ఇప్పుడు తనను తాను మార్చుకునే పనిలో పడింది సుమ. అందుకే జిమ్‌లోకి వెళ్లి చెమటలు కక్కుతుంది. తాజాగా సుమ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు వర్కవుట్స్ చేయడం అనేది కామన్.. కానీ స్టార్ యాంకర్ సుమ కూడా ఇప్పుడు ఇదే బాటలో వెళ్తుంది. ఈమె కూడా బరువు తగ్గించుకొని ఫిజిక్ కాపాడుకోడానికి వర్కవుట్స్ మొదలు పెట్టింది. అంటే ఈ లెక్కన ఇప్పట్నుంచి సుమ వరసగా సినిమాలు చేస్తుందేమో మరి..? జయమ్మ పంచాయితీతోనే ఈ నట ప్రస్థానం ఆగదన్నమాట. ఈమె జిమ్‌లో చెమటోడుస్తున్న తీరు చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది కారెక్టర్ ఆర్టిస్టులకు పోటీ తప్పదేమో అనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.