హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: తీవ్ర విషాదంలో పూజా హెగ్డే.. ఆమెను జీవితంలో గెలిపించిన వ్యక్తి కన్నుమూత..

Pooja Hegde: తీవ్ర విషాదంలో పూజా హెగ్డే.. ఆమెను జీవితంలో గెలిపించిన వ్యక్తి కన్నుమూత..

పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్ (Pooja Hegde/Instagram)

పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్ (Pooja Hegde/Instagram)

Pooja Hegde: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నారు పూజా హెగ్డే(Pooja Hegde). ఆచార్యలో రామ్ చరణ్(Ram Charan)‌కు జోడీగా నటిస్తున్న ఈమె.. ప్రభాస్‌(Prabhas)తో రాధే శ్యామ్.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు గుండె పగిలే వార్త వచ్చింది.

ఇంకా చదవండి ...

పూజా హెగ్డే ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ క్రమంలోనే తన బాధను అభిమానులతో పంచుకున్నారు. తనకు చాలా యిష్టమైన ఓ వ్యక్తి మరణం తనను తీవ్రంగా కలిసి వేసిందని తెలిపారు పూజా. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆ వ్యక్తి కూడా అంటూ కన్నీరు మున్నీరయ్యారు పూజా. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్రస్థానంలో దూసుకుపోతున్న పూజా.. వరస సినిమాలు చేస్తున్నారు. ఆచార్యలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న ఈమె.. ప్రభాస్‌తో రాధే శ్యామ్.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ వాయిదా పడటంతో ఇంటి దగ్గరే ఉన్నారు పూజా. ఈ క్రమంలోనే ఈమెకు గుండె పగిలే న్యూస్ ఒకటి తెలిసింది. తన జీవితంలో ఎంతో ప్రభావితం చేసి.. తనను అన్ని విధాలుగా ప్రోత్సహించిన తన స్కూల్ టీచర్ జెసీకా దరువాలా మరణం ఈమెను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఢిల్లీలోని మానెక్ జీ కూపర్ స్కూల్‌లో చదువుకున్నారు పూజా హెగ్డే. అందులో ఆమెకు బాగా యిష్టమైన టీచర్ జెసికా దరువాలా. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమె ఇప్పుడు మరణించారు.

ఈమె మరణవార్త తెలుసుకున్న పూజా కన్నీటి పర్యంతమైంది. స్కూల్‌లో తనకు అందరికంటే ఎక్కువ యిష్టమైన టీచర్ ఈమె అని.. తను నిరాశలో ఉన్నా దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పేవారని ఆమెను గుర్తు చేసుకున్నారు. అలాగే జీవితంలో కుంగిపోవడం కంటే ఓటమి మరోటి లేదని ధైర్యం చెప్పేవారని గుర్తు చేసుకున్నారు పూజా హెగ్డే. ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయిందని తెలిపారు ఈ భామ.

pooja hegde,pooja hegde twitter,pooja hegde instagram,pooja hegde movies,pooja hegde hot photos,pooja hegde teacher death,pooja hegde teacher dies post,telugu cinema,పూజా హెగ్డే,పూజా హెగ్డే టీచర్ మృతి,పూజా హెగ్డే టీచర్ కన్నుమూత
పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్ (Pooja Hegde/Instagram)

తన కెరీర్‌లో ఇంత సక్సెస్ అయ్యానన్నా.. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానన్నా దానికి ప్రధాన కారణం జెసీకా టీచర్ కూడా అని చెప్పుకొచ్చారు పూజా. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేసారు ఈమె. తమ స్కూల్‌లో జెసికా టీచర్ బయోగ్రఫీ చెప్పేవారని.. తన విజయానికి కారణమైన టీచర్ మరణం తనకు తీరనిలోటు అంటూ సోషల్ మీడియాలో బాధను అభిమానులతో పంచుకున్నారు పూజా హెగ్డే.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Pooja Hegde, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు