Tollywood: తెలుగు సినిమా పరిశ్రమకు అతిపెద్ద సీజన్ సంక్రాంతి. ఈ పండక్కి ఒకటికి నాలుగు సినిమాలు విడుదలైన ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరించిన సందర్భాలున్నాయి. అందుకే తెలుగులో అలనాటి అగ్ర హీరోల నుంచి ఇప్పటి బడా స్టార్స్ వరకు అందరు సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ సమయంలో సందేట్లో సడేమియా లాగా కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఈ రేసులో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి థియేటర్స్ అడ్జస్ట్ చేయడం ఎగ్జిబిటర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక రాబోయే సంక్రాంతి సీజన్లో ఇప్పటికే ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ’వీరసింహారెడ్డి’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనబోతున్నాయి.
ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. గతంలో ఒక హీరో లేదా హీరోయిన్ నటించిన సినిమాలు ఒకేసారి విడుదలైన సందర్భాలున్నాయి. కానీ ఈ సారి ఒకే నిర్మాణ సంస్థ ఒకప్పుడు బాక్సాఫీస్‌ను శాసించిన ఇద్దరు బడా స్టార్ హీరోలైన బాలయ్య, చిరులతో సినిమాలను విడుదల చేస్తుండటం. వీళ్లిద్దరు పలు మార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం విశేషంగా చెప్పుకోవాలి.
కానీ ఈ సారి ఈ ఇద్దరు బడా సీనియర్ టాప్ స్టార్ సినిమాలతో పాటు అఖిల్ ‘ఏజెంట్’ మూవీతో పాటు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసారు. సంక్రాంతి, దసరాలకు విడుదలయ్యే సినిమాల్లో ముందుగా తెలుగులో తెరకెక్కించిన స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒకవేళ థియేటర్స్ మిగిలి ఉంటే డబ్బింగ్ సినిమాలు కేటాయిస్తామని మండలి తమ లేఖలో పేర్కొంది.
గతంలో దిల్ రాజు ప్రస్తుత ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ 2019లో మీడియా ద్వారా స్ట్రెయిట్ సినిమాలు ఉండగా.. డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తామంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతికి మొదటి ప్రాధాన్యతగా తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే ఇవ్వాలని ఎగ్జిబిటర్స్‌ను కోరారు. మరి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి లేఖతో దిల్ రాజుకు పెద్ద తలనొప్పి మొదలైందనే చెప్పాలి. ఈయన విజయ్‌తో నిర్మిస్తోన్న ‘వరిసు’ (వారసుడు) తెలుగులో కూడా రిలీజవుతోంది. మరి TFPC లేఖపై దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈయన తెరకెక్కించిన ‘వరిసు’ సినిమాకు చిరు, బాలయ్య సినిమాలకు ఎక్కువ థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై దిల్ రాజుకు వ్యతిరేకంగా చిరు, బాలయ్య అభిమానులు సంయుక్తంగా సోషల్ మీడియా వేదికగా ఎండగట్టిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Chiranjeevi, TFPC, Tollywood, Veera Simha Reddy, Waltair Veerayya