• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD TALENTED DIRECTOR ANIL RAVIPUDI BUY A NEW LUXURY VILLA AT HYDERABAD COSTLY AREA HERE ARE THE DETAILS TA

Anil Ravipudi: హైదరాబాద్‌ ఖరీదైన ఏరియాలో లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Anil Ravipudi: హైదరాబాద్‌ ఖరీదైన ఏరియాలో లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

అనిల్ రావిపూడి (Anil Ravipudi)

Anil Ravipudi: హైదరాబాద్ ఖరీదైన ఏరియాలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Anil Ravipudi: హైదరాబాద్ ఖరీదైన ఏరియాలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌లో పటాస్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి.. ఆ తర్వాత ‘సుప్రీమ్’ , ‘రాజా ది గ్రేట్’, వంటి సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకున్నాడు. అటు వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ఎఫ్ 2 వంటి కామెడీ ఎంటర్టైనర్‌తో మరోసారి ప్రేక్షకులను నవ్వించి మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇపుడు మరోసారి వెంకటేస్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అతిథి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు అనిల్ రావిపూడి.. ‘గాలి సంపత్’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, అచ్చు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో అనిల్ రావిపూడి.. బాలయ్యతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్టు సమాచారం.

    ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా అనిల్ రావిపూడి దర్శకుడిగా తను సంపాదించిన డబ్బులతో హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతంలో దాదాపు రూ. 12 కోట్లతో ఓ ఖరీదైన లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ లగ్జరీ ఫ్లాట్‌లో ఈత కొలనుతో పాటు జిమ్‌ సహా సమస్త సదుపాయాలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇంటి ఫర్నీచర్ కోసం దాదాపు మరో రూ. కోటి రూపాయలు కేటాయించడట. ఇప్పట్లో సరైన ముహూర్తాలు లేనందున మే నెలలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దలను పిలిచి గృహ ప్రవేశం చేయనున్నట్టు అనిల్ రావిపూడి సన్నిహితులు చెబుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు