చార్మినార్ చౌరస్తాలో మహేష్ బాబు.. దాని కోసమేనా..

చార్మినార్ చౌరాస్తాలో మహేష్ బాబు సందడి చేయనున్నాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 16, 2019, 8:34 AM IST
చార్మినార్ చౌరస్తాలో మహేష్ బాబు.. దాని కోసమేనా..
మహర్షి సినిమా సక్సెస్ మీట్లో మహేష్ బాబు
  • Share this:
చార్మినార్ చౌరాస్తాలో మహేష్ బాబు సందడి చేయనున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు తెలుగు సినిమాలకు చార్మినార్ చౌరాస్తానే కేరాఫ్ అడ్రస్. హైదరాబాద్  ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు మరో పేరే చార్మినార్ చౌరస్తా.  ఒకప్పుడు హైదరాబాద్..ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒక సినిమా 100 రోజులు పూర్తి కానీదే హిట్టు అనేవారు కాదు మాములు సిని ప్రేక్షకులు. సినిమా సక్సెస్‌కు వంద రోజులనేది అప్పట్లో ఒక బెంచ్ మార్క్‌లా ఉండేది. రాను రాను టెక్నాలజీతో పాటు పైరసీ పుణ్యమా అని .. తక్కువ టైమ్‌లో ఎక్కువ వసూళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు సినీ జనాలు. తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి  ఔరా అనిపించింది. దీంతో మహేష్ బాబు.. తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి మరింత కృషి చేస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు.. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో సాయంత్రం 6 గంటల జరగనున్న ‘మహర్షి’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది.

దీని కోసం సుదర్శన్ 35 ఎంఎం యాజమాన్యం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ థియేటర్‌కు మహేష్ బాబుకు మంచి అనుబంధమే ఉంది. ఈ థియేటర్‌లోనే మహేష్ బాబు నటించిన ‘మురారి’,‘ఒక్కడు’,‘అతడు’,‘పోకిరి’,‘దూకుడు’,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’,‘బిజినెస్ మేన్’ వంటి పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి.  తాజాగా మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం ఈ థియేటర్‌లో రన్ అవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేష్ ముఖ్యపాత్రలో నటించాడు.
First published: May 15, 2019, 7:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading