హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబు జీవితాన్ని సక్సెస్ చేసిన ఫ్లాప్ మూవీ ఇదే..

మహేష్ బాబు జీవితాన్ని సక్సెస్ చేసిన ఫ్లాప్ మూవీ ఇదే..

‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)

‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో అదొక డిజాస్టర్ మూవీ. పండుగాడి కెరీర్‌లో వచ్చిన ఆ చిత్రం మహేష్‌బాబును ఎంతో నిరాశకు గురిచేసింది. అయినా ఆ మూవీని ఇప్పటికీ సూపర్ స్టార్ అభిమానులు గుర్తు పెట్టుకున్నారు.

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో అదొక డిజాస్టర్ మూవీ. పండుగాడి కెరీర్‌లో వచ్చిన ఆ చిత్రం మహేష్‌బాబును ఎంతో నిరాశకు గురిచేసింది. అయినా ఆ మూవీని ఇప్పటికీ సూపర్ స్టార్ అభిమానులు గుర్తు పెట్టుకున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో చేదు గుర్తుగా మిగిలిపోయినా ఆ సినిమా. అతని జీవితానికి తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇంతకీ మహేశ్ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సినిమానే ‘వంశీ’.తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్థాపించిన పద్మాలయా బ్యానర్‌లో మహేష్ బాబు నటించిన ఏకైక చిత్రం ‘వంశీ’. అంతేకాదు హీరో అయిన తర్వాత మహేష్ బాబు..తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పూర్తిస్థాయిలో నటించిన ఒకే ఒక్క సినిమా ‘వంశీ’. ఈ చిత్రంలో మహేష్ బాబు, నమ్రతలు మొదటిసారి జంటగా కలిసి నటించారు.

    వంశీ మూవీలో మహేశ్, నమ్రత

    అంతేకాదు ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు కలిసి నటించక పోయినా..కలిసి జీవించాలని నిర్ణయం తీసుకొని ఒకింటి వారయ్యారు. మహేశ్, నమ్రతలను కలిపిన ‘వంశీ’మూవీ నేటితో 19 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది.

    తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో సూపర్ స్టార్ మహేశ్

    బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ మూవీకి మణిశర్మ అద్భుతమైన బాణీలు అందించారు. ఒక రకంగా తండ్రి కృష్ణతో పాటు..భార్య నమ్రతతో మహేష్ బాబు నటించిన ఏకైక మూవీగా ‘వంశీ’ రికార్డులకు ఎక్కింది. మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన ‘వంశీ’ మూవీ... నిజ జీవితంలో మాత్రం నమ్రతతో మహేష్ బాబు జీవితాన్ని సూపర్ హిట్ చేసింది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Krishna, Mahesh Babu, Namrata, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు