కన్నడ ప్రేక్షకులకు సినిమా చూపించనున్న మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు కన్నడ ప్రేక్షకులకు సినిమా చూపించబోతున్నాడు. ఆల్రెడీ ఈయన హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బెంగుళూరులో విడుదలైన సంగతి తెలిసిందే కదా.

news18-telugu
Updated: January 25, 2020, 8:18 PM IST
కన్నడ ప్రేక్షకులకు సినిమా చూపించనున్న మహేష్ బాబు..
మహేష్ బాబు (Twitter/Photo)
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు కన్నడ ప్రేక్షకులకు సినిమా చూపించబోతున్నాడు. ఆల్రెడీ ఈయన హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బెంగుళూరులో విడుదలైన సంగతి తెలిసిందే కదా. కానీ ఈసారి మాత్రం మహేష్ బాబు కన్నడ ప్రేక్షకుల కోసం స్పెషల్‌గా బెంగళూరులో పెద్ద థియేటర్స్‌తో కూడిన మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నట్టు సమాచారం. ఆల్రెడీ తెలంగాణ హైదరాబాద్‌లో ఏఎంబీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభమై యేడాది కావొస్తోంది. త్వరలో బెంగుళూరు, చెన్నైలో ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ మల్లీప్లెక్స్‌ను కూడా మహేష్ బాబు.. ఏషియన్ సినిమా వాళ్లతో కలిసి నిర్మించనున్నాడు. త్వరలో ఈ మల్టీప్లెక్స్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో మహేష్ బాబు తన సెలవులను ఎంజాయ్ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. అక్కడ తన మోకాళ్లకు సంబంధించిన చికిత్స్ చేయించుకోనున్నట్టు సమాచారం. ఆ తర్వాత మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు