హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: కొత్త లుక్‌లో కుర్రాళ్లను కుళ్లుకునేలా చేస్తోన్న మహేష్ బాబు..

Mahesh Babu: కొత్త లుక్‌లో కుర్రాళ్లను కుళ్లుకునేలా చేస్తోన్న మహేష్ బాబు..

మహేష్ బాబు (Instagram/Namrata/Photo)

మహేష్ బాబు (Instagram/Namrata/Photo)

Mahesh Babu | సాధారణంగా అందరూ ఏజ్ పెరుగుతూ ఉంటే.. ముసలివాళ్లు అయిపోతారు. కానీ మహేష్ బాబు మాత్రం వయసు మీద పడుతున్న ఇప్పటికీ కొత్త యవ్వనంతో తొణికిసలాడుతున్నాడు. తాజాగా మహేష్ బాబును చూస్తే.. అది నిజమే కాబోలు అనిపిస్తోంది.

  Mahesh Babu | సాధారణంగా అందరూ ఏజ్ పెరుగుతూ ఉంటే.. ముసలివాళ్లు అయిపోతారు. కానీ మహేష్ బాబు మాత్రం వయసు మీద పడుతున్న ఇప్పటికీ కొత్త యవ్వనంతో తొణికిసలాడుతున్నాడు. అంతేకాదు ఇపుడొచ్చే కుర్ర హీరోలను సైతం కుళ్లుకునేలా చేస్తున్నాడు. తాాజాగా మహేష్ బాబు దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 3 గంటలకు దిగిన ఫోటోను నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇంత ఉదయం ఇలా ఎవరైనా రెడీ అవుతారా అంటూ కామెంట్ కూడా జత చేసింది నమ్రత. ఇక మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం టైమ్ ఉండటంతో తన కుటుంబంతో కలసి నమ్రత.. సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఇంటికి వెళ్లారు. అక్కడ షాపింగ్‌తో పాటు పిల్లలతో ఆడిపాడాడు. దానికి సంబంధించిన ఫోటోలను మహేష్ బాబుతో పాటు నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. ఐతే.. మహేష్ బాబు వెళ్లింది.. దుబాయి కేనా.. లేకపోతే.. వేరే విమానం నుంచి వయా దుబాయ్ లో లాండ్ అయి.. హైదరాబాద్‌కు వచ్చారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.


  ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మహేష్ బాబు.. అదే ఊపులతో పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోతే.. ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ షూటింగ్ కంప్లీటో కూడా అయ్యేది. కానీ ఈ సినిమాను వచ్చే యేడాది జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను అమెరికా నేపథ్యంలో బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mahesh babu, Namrata, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు