TOLLYWOOD SUPER STAR MAHESH BABU GIVEN HIS REVIEW ON RRR AND PRAISED RAJAMOULI DIRECTION AND ACTING OF RAM CHARAN JR NTR PK
Mahesh Babu RRR review: ‘RRR’ ఎపిక్ అంటూ మహేష్ బాబు రివ్యూ.. రాజమౌళి సినిమాలు వేరప్పా..!
మహేష్ బాబు ట్రిపుల్ ఆర్ సినిమా రివ్యూ (mahesh babu rrr)
Mahesh Babu RRR review: తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాలో ఎన్నో వందల మంది దర్శకులున్నారు. అందులో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. అయితే అంతమంది నెంబర్ వన్ అనిపించుకోవాలంటే మాత్రం చిన్న విషయం కాదు. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli).
తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాలో ఎన్నో వందల మంది దర్శకులున్నారు. అందులో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. అయితే అంతమంది నెంబర్ వన్ అనిపించుకోవాలంటే మాత్రం చిన్న విషయం కాదు. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). బాహుబలితోనే తానేంటో ఇండియన్ సినిమాకు రుచి చూపించిన ఈయన.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ (RRR)తో మరోసారి సంచలనం వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమా తొలి రోజు 223 కోట్లు వసూలు చేసింది. సాధారణంగా పెద్ద సినిమా విడుదలైతే చాలు.. ఆడియన్స్ థియేటర్స్ దగ్గర పోటెత్తుతుంటారు. కానీ రాజమౌళి సినిమా విడుదలైతే మొదటి రోజు థియేటర్స్‌కు టాలీవుడ్ ప్రముఖులు కూడా క్యూ కడుతుంటారు. కామన్ ఆడియన్స్‌తో పోటీ పడీ మరీ వాళ్లు కూడా సినిమా చూస్తుంటారు. స్టార్ హీరోలతో పాటు దర్శక నిర్మాతలు, టెక్నీషియన్ రాజమౌళి సినిమా చూసి పండగ చేసుకుంటారు.
ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాను ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు చూసారు. అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి హీరోలు తమ రివ్యూ కూడా చెప్పేసారు. ఇప్పుడు మహేష్ బాబు వంతు. సాధారణంగా విడుదలైన ప్రతీ సినిమాను చూడటం.. దానిపై తన అభిప్రాయం చెప్పడం మహేష్ బాబుకు (Mahesh Babu) అలవాటు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన మహేష్ బాబు.. రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసాడు.
@tarak9999 and @AlwaysRamCharan grow beyond their stardom and come out with performances which are out of this world!! The law of gravity didn't seem to exist in the Natu-Natu song! They were literally flying!! 👏👏👏
ఇలాంటి గొప్ప సినిమాను ఇండస్ట్రీకి ఇచ్చినందుకు చిత్ర యూనిట్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలిపారు మహేష్ బాబు. అంతేకాదు.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి గొప్పగా రాసాడు మహేష్ బాబు. తమ స్టార్ డమ్ పట్టించుకోకుండా క్యారెక్టర్స్‌కు ప్రాణం పోసిన చరణ్, ఎన్టీఆర్ నటనను ఆకాశానికి ఎత్తేసాడు మహేష్ బాబు. ఇద్దరి నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు సూపర్ స్టార్. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి ప్రత్యేకంగా ప్రస్థావించాడు మహేష్ బాబు.
There are films and then there are SS Rajamouli films! #RRR E.P.I.C!! The scale, grandeur visuals, music & emotions are unimaginable, breathtaking and simply stunning!
దాంతో పాటు రాజమౌళిని మాస్టర్ స్టోరీ టెల్లర్ అంటూ మునగ చెట్టెక్కించేసాడు. మొత్తంగా ట్రిపుల్ ఆర్ సినిమాను ఎపిక్ అంటూ రాసుకొచ్చాడు మహేష్. ఊహకు కూడా అందని విధంగా ఈ సినిమా ఉందని.. అద్భుతమైన విజువల్ గ్రాండియర్‌తో పాటు అదిరిపోయే మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయిందని చెప్పాడు మహేష్ బాబు.
Hearty Congratulations to the Entire team of #RRR . What a spectacular movie. My respect to our pride @ssrajamouli garu for the vision. Soo proud of my brother a mega power @AlwaysRamCharan for a killer & careers best performance. My Respect & love to my bava… power house
మహేష్ బాబు కంటే కొన్ని గంటల ముందు అల్లు అర్జున్ కూడా ఈ సినిమా చూసి తన అభిప్రాయం షేర్ చేసాడు. ఆయన కూడా చరణ్, ఎన్టీఆర్ నటనతో పాటు రాజమౌళి డైరెక్షన్ గురించి పొగిడేసాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.