• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD SUPER STAR MAHESH BABU BUSY IN SARKARU VAARI PAATA MOVIE SHOOTING WITH COMPLETED PROTECTION PK

Mahesh Babu: మహేష్ బాబును వెంటాడుతున్న కరోనా భయం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో..?

Mahesh Babu: మహేష్ బాబును వెంటాడుతున్న కరోనా భయం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో..?

మహేష్ బాబు (Mahesh Babu)

Mahesh Babu: పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా చాలా మంది హీరోలు షూటింగ్స్ ఆపేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు(Mahesh Babu) మాత్రం తన సర్కారు వారి పాట సినిమా షూటింగ్ వేగంగా చేస్తున్నాడు. తమ హీరోను జాగ్రత్తగా చూసుకోండి అంటూ దర్శక నిర్మాతలకు సోషల్ మీడియాలో మెసేజ్‌లు కూడా పెడుతున్నారు.

  • Share this:
పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా చాలా మంది హీరోలు షూటింగ్స్ ఆపేస్తున్నారు. సినిమాలు వాయిదా వేస్తున్నారు. కేసులు తగ్గిన తర్వాత షూటింగ్ చేసుకుందాంలే అనుకుంటూ కామ్ అయిపోతున్నారు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు మాత్రం తన సర్కారు వారి పాట సినిమా షూటింగ్ వేగంగా చేస్తున్నాడు. ఈయన షూటింగ్ అయితే చేస్తున్నాడు కానీ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. తమ హీరోను జాగ్రత్తగా చూసుకోండి అంటూ దర్శక నిర్మాతలకు సోషల్ మీడియాలో మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఇంతటి రిస్క్ తీసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఇంత వేగంగా కేసులు పెరుగుతాయని ముందుగా మహేష్ బాబు టీం కూడా ఊహించలేదు. అయితే పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఔట్ డోర్ కాకుండా ఇన్ డోర్‌లో కానిచ్చేస్తున్నారు. శంకర్ పల్లి దగ్గర ఓ సెట్ వేసి 20 రోజులు అక్కడే షూటింగ్ చేస్తున్నారు. ఓ వైపు పెరుగుతున్న కరోనా కారణంగా సినిమాలు వాయిదా పడుతున్నాయి. కరోనా విజృంభణతో గోవా షెడ్యూల్ పూర్తిగా క్యాన్సిల్ చేసారు.

ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు. అయితే షూటింగ్‌లో ఉన్న మహేష్ బాబుకు కరోనా సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్ మెంబర్స్ కూడా చాలా కేరింగ్‌గా ఉన్నారు. యూనిట్ సభ్యుల్లో ఏ ఒక్కరికి కరోనా వచ్చినా కూడా షూటింగ్ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోవడం లేదు మహేష్ బాబు.
mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu movie shooting,mahesh babu sarkaru vaari paata shooting,mahesh babu corona protection,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు కరోనా జాగ్రత్తలు,మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్
సర్కారు వారి పాట (Sarkaru Vaari paata)

పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్స్ వాయిదా వేసుకున్నా కూడా మహేష్ బాబు మాత్రం సర్కారు వారి పాట సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దర్శకుడు పరశురామ్.. నిర్మాతలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి అనుకున్నారు కానీ అనుకున్న తేదీ కంటే 3 నెలలు ముందుగానే విడుదల చేయాలని చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: