Tollywood Stars Combo: అదే కాంబో.. మొదటి సినిమా హిట్టు.. రెండో సినిమా ఫట్టు.. ఎవరివంటే?

Tollywood Stars Combo

Tollywood Stars Combo: చాలా వరకు ఒకె డైరెక్టర్ తో కలిసి కొందరు హీరోలు కొన్ని సినిమాలు చేస్తుంటారు. ఇక అందులో కొన్ని హిట్ అవ్వచ్చు.. కొన్ని ఫట్ అవ్వచ్చు.. అలా ఒకే డైరెక్టర్ తో ఒక హీరో మొదటి సినిమా సూపర్ హిట్ అందుకోగా అదే డైరెక్టర్ తో రెండో సినిమాలో మాత్రం ప్లాఫ్ అందుకున్న సినిమాలు ఉన్నాయి.

  • Share this:
    Tollywood Stars Combo: చాలా వరకు ఒకె డైరెక్టర్ తో కలిసి కొందరు హీరోలు కొన్ని సినిమాలు చేస్తుంటారు. ఇక అందులో కొన్ని హిట్ అవ్వచ్చు.. కొన్ని ఫట్ అవ్వచ్చు.. అలా ఒకే డైరెక్టర్ తో ఒక హీరో మొదటి సినిమా సూపర్ హిట్ అందుకోగా అదే డైరెక్టర్ తో రెండో సినిమాలో మాత్రం ప్లాఫ్ అందుకున్న సినిమాలు ఉన్నాయి. ఇక అదే ఏ సినిమానో, ఏ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ లో కొన్ని విషయాలు తెలుసుకుందాం..

    చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన సినిమా ప్రేమమ్. మలయాళం రీమేక్ నుండి తెరకెక్కిన ప్రేమమ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆయన దర్శకత్వంలో నే చైతన్య.. మరో సినిమా సవ్యసాచి లో నటించగా.. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోగా.. ఈ సినిమా సక్సెస్ ను అందుకోలేకపోయింది.

    ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటించిన సినిమా శివమణి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక నాగార్జున మళ్ళీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ సినిమాలో నటించగా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయిందన్న సంగతి తెలిసిందే.

    ఇక రాఘవ లారెన్స్, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా మాస్. ఈ సినిమాతో రాఘవ లారెన్స్ డైరెక్టర్ గా మారగా.. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు రాఘవ. ఇక రాఘవ తన దర్శకత్వంలో నాగార్జున తోని మరో సినిమా డాన్ తెరకెక్కించగా.. ఈ సినిమా మాత్రం మంచి సక్సెస్ ను అందుకోలేకపోయింది.

    ఇక పూరి జగన్నాథ్.. తన దర్శకత్వంలో మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన సినిమా బద్రి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మళ్ళీ పూరి తన దర్శకత్వం లో పవన్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేయగా.. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోగా.. అంత విజయాన్ని అందుకోలేదు.

    ఇక పవన్ కళ్యాణ్ మరో దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఖుషి సినిమా లో నటించగా.. ఈ సినిమా ఎంత సక్సెస్ ను అందుకుందో.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ సినిమా మంచి క్రేజ్ లో ఉండగా.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా కొమరం పులి. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

    ఇక యంగ్ హీరో మహేష్ బాబు నటించిన సినిమా దూకుడు. ఈ సినిమాకు శ్రీను వైట్ల తన దర్శకత్వంని అందించగా.. బ్లాక్ బస్టర్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ఆగడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అంతా సక్సెస్ కాకపోగా.. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఊహించుకోగా వారిని నిరాశపరిచింది.

    ఇక వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించగా.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సాంబ సినిమా తెరకెక్కగా.. ఈ సినిమా లో ఎన్టీఆర్ నటన అభిమానులను ఆకట్టుకుంది కానీ.. అంత సక్సెస్ అందుకోలేదు.

    ఇక మహేష్ బాబు నటించిన మల్టీ స్టార్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మళ్లీ అదే సక్సెస్ తో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం అనే సినిమా తెరకెక్కగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు.

    త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా అతడు. ఈ సినిమా మంచి కథతో తెరకెక్కగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇదే సక్సెస్ తో త్రివిక్రమ్, మహేష్ తో కలిసి మరో సినిమా ఖలేజా తెరకెక్కించాడు. ఈ సినిమా కొంతవరకు ప్రేక్షకులను మెప్పించగా.. తమ ఖాతాలో మాత్రం ప్లాప్ గా మారింది.

    ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా ఆర్య. ఈ సినిమా ఎంత సక్సెస్ ను అందుకుందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాను సుకుమార్ తన దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇక ఇదే టైటిల్ తో ఆర్య 2 గా వీరిద్దరి కాంబినేషన్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా అంత సక్సెస్ ను అందుకోనందున ప్లాఫ్ గా పేరు తెచ్చుకుంది.

    సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. హీరో రవితేజ నటించిన సినిమా కిక్. ఈ సినిమా మంచి కథతో తెరకెక్కింది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అవ్వగా.. మంచి సక్సెస్ అందుకుంది. టాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో కిక్ 2 తెరకెక్కించగా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.
    Published by:Navya Reddy
    First published: