Republic movie review by Nani: ‘రిపబ్లిక్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బొమ్మ అదిరింది అంటున్న నాని..

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ (Sai Tej Republic movie)

Republic movie review by Nani: సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే.. ఓ రకమైన ఎమోషనల్ ఫీలింగ్‌లోకి వెళ్లిపోతున్నారు అభిమానులు. దానికి కారణం ఆయనకు జరిగిన ప్రమాదమే. తాజాగా ఈ సినిమా చూసిన నాని (Republic movie review by Nani).. తన రివ్యూతో అంచనాలు మరింత పెంచేసాడు.

  • Share this:
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే.. ఓ రకమైన ఎమోషనల్ ఫీలింగ్‌లోకి వెళ్లిపోతున్నారు అభిమానులు. నెల రోజుల కింది వరకు అయితే అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అదొక మామూలు సినిమా. కానీ ఇప్పుడు అలా కాదు. దానికి కారణం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయి ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉండటమే. ప్రమాదం జరిగి 20 రోజులు కావొస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈయన ఆరోగ్యంపై స్పష్టమైన క్లారిటీ అయితే ఎవరూ ఇవ్వలేదు. కొందరు బాగున్నారని చెప్పారు.. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా కోమాలోనే ఉన్నాడని షాకిచ్చాడు. ఇలాంటి సమయంలో వస్తున్న రిపబ్లిక్ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అక్టోబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఈ లోపు ప్రముఖుల కోసం స్పెషల్ ప్రీమియర్ వేసారు. అందులో నాని కూడా ఉన్నాడు. దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన రిపబ్లిక్ సినిమాను అందరి కంటే ముందే చూసాడు నాని. దీని గురించి ట్వీట్ కూడా చేసాడు. ఈ సినిమాను జి స్టూడియోస్, జేబీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.

చాలా రోజుల తర్వాత సీనియర్ నిర్మాతలు జె భగవాన్ ,జె పుల్లారావ్ రిపబ్లిక్ సినిమాను నిర్మించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమాని చూసిన తర్వాత రిపబ్లిక్ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు నాని.


సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై దయ చూపించాడు.. అది మీ ప్రార్థనల రూపంలో తిరిగి వచ్చింది.. అది రేపు మరింత బలంగా రిపబ్లిక్ సినిమా రూపంలో రాబోతుందని తెలిపాడు. దర్శకుడు దేవా కట్టా చాలా రోజుల తర్వాత అసలైన కమ్ బ్యాక్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. రిపబ్లిక్ సినిమా టీంకు అభినందనలు తెలిపాడు నాని. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడు నాని. ఈయనతో పాటు మరికొందరు కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా తిలకించారు.
Published by:Praveen Kumar Vadla
First published: