హోమ్ /వార్తలు /సినిమా /

నేను అంత ధనవంతుడ్ని కాదు..అందుకే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా..

నేను అంత ధనవంతుడ్ని కాదు..అందుకే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా..

నేను అంత ధనవంతుడ్ని కాదు..అందుకే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా..

నేను అంత ధనవంతుడ్ని కాదు..అందుకే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా..

I'm not rich: తాను శ్రీమంతుడ్ని కాదన్నారు హీరో రామ్‌చరణ్‌. ఏరోప్లేన్ కంపెనీ ఉంటే సినిమాలు ఎందుకు చేస్తానని..అంత డబ్బు లేదు కాబట్టే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానన్నారు. ముంబైలో జరిగిన ట్రిపులార్‌ మూవీ ప్రమోషన్‌లో ఈ విషయాన్ని చెప్పారు మెగా పవర్‌ స్టార్‌. రామ్‌చరణ్‌ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...

టాలీవుడ్‌ హీరోలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. మన హీరోలు కొనుగోలు చేసే ఖరీదైన వస్తువులు, వాళ్లకున్న విలాసవంతమైన బంగ్లాలు, చేసే వ్యాపారాలను ఆధారంగా చేసుకొని ఇండస్ట్రీ పెద్దలు, సెలబ్రిటీలు, అభిమానులు వాళ్లను శ్రీమంతులుగా చూస్తారు. టాలీవుడ్‌కి చెందిన టాప్‌ హీరోల్లో ఒకరైన మెగా పవర్‌స్టార్‌ మాత్రం తాను ఐశ్వర్యవంతుడ్ని కాదన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న చిరంజీవి వారసుడైన రామ్‌చరణ్..నటుడిగా కూడా మెగాపవర్‌ స్టార్‌ అనే ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌తో పాటు ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారారు రామ్‌చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రొడ్యూసర్‌గా మారారు చెర్రి. అదే నిర్మాణ సంస్ధలో  భారీ బడ్జెట్‌ సినిమాలు రూపొందిస్తున్నారు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. అయితే తాను మాత్రం అంత ధనవంతుడ్ని కాదన్నారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈవిషయాన్ని క్లియర్‌కట్‌గా చెప్పారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌.

మెగాపవర్‌స్టార్‌ అంత రిచ్‌ కాదంట..

ట్రిపులార్‌ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్, డైరెక్టర్‌ రాజమౌళి, హీరోయిన్ అలియాభట్. ప్రమోషన్‌లో భాగంగానే ముంబైలోని ఓ టీవీ షోకి వెళ్లారు. అక్కడే రామ్‌చరణ్‌తో తాను శ్రీమంతుడ్ని కాదనే విషయాన్ని చెప్పించారు వ్యాఖ్యాత కపిల్‌శర్మ. షో లో భాగంగా కపిల్‌శర్మ రామ్‌చరణ్‌ను మీకు ఏరోప్లేన్ కంపెనీ, హోటళ్లు, ఆసుపత్రులు ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయంట కదా.. అంత డబ్బుండి హాయిగా రెస్ట్  తీసుకోకుండా..ఎందుకిలా సినిమాలు, ప్రమోషన్‌లు అంటూ పరుగులు పెడుతున్నారని ప్రశ్నించాడు. దానికి రామ్‌చరణ్‌ నవ్వుతూ..నాకు ఫ్లైట్ల కంపెనీ లేదని..అదే ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు కదా అంటూ బదులిచ్చారు. డబ్బులు లేవు కాబట్టే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానంటూ కూల్‌గా ఆన్సర్ ఇచ్చారు మెగాపవర్‌స్టార్.

టీవీ షోలో షాకింగ్‌ న్యూస్ చెప్పిన రామ్‌చరణ్..

న్యూ ఇయర్‌కి స్పెషల్‌గా చేసిన కపిల్‌ శర్మ షో ప్రోమో రిలీజైంది. అందులోనే రామ్‌చరణ్‌ తనకు ఫ్లైట్‌ కంపెనీ లేదని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌కి వెళ్లిన ట్రిపులార్‌ హీరోలు, డైరెక్టర్‌, హీరోయిన్‌తో చాలా సరదాగా నవ్విస్తూనే..వెరైటీ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాడు వ్యాఖ్యాత. ఇక ఇదే షోలో హీరో ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ రాజమౌళిని కూడా తన కొంటె ప్రశ్నలతో నవ్వించాడు. అసలు ట్రిపులార్‌ అనే టైటిల్‌  పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చిందని అడిగాడు. ఎన్టీఆర్‌ని సైతం మీరు ఎయిర్‌పోర్ట్‌కి వెళితే..పేరు చెబితే సరిపోతుందా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ పేపర్ చూపించాలా అంటూ చమత్కారం చేశాడు.

First published:

Tags: Ram charan gifts car, RRR, Rrr fight sceans, RRR for ugadi 2022

ఉత్తమ కథలు