హోమ్ /వార్తలు /సినిమా /

అమ్మకు ప్రేమతో... నాచురల్ స్టార్ నాని స్పెషల్ పోస్ట్

అమ్మకు ప్రేమతో... నాచురల్ స్టార్ నాని స్పెషల్ పోస్ట్

నాని, విజయ లక్ష్మి

నాని, విజయ లక్ష్మి

రీసెంట్‌గా గ్యాంగ్ లీడర్ మూవీతో ప్రేక్షకులను నవ్వించిన నాని.. ప్రస్తుతం 'వి' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబు కూడా హీరో పాత్ర పోషిస్తున్నారు.

ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ కంటే విలువైనది ఏదీ లేదు. కోట్ల ఆస్తులు, అంతస్తులు.. ఇవేవీ ఇవ్వలేని సంతోషాన్ని తల్లి ప్రేమ మాత్రమే ఇస్తుంది. అందుకే అమ్మ ప్రత్యేకం.. అమ్మ ప్రేమే శాశ్వతం..! ఇవాళ టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని తల్లి విజయలక్ష్మి పుట్టిన రోజు. అమ్మ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు నాని. ఆమె ఫొటోను సోషల్ మీడియా షేర్‌చేసి.. ఈ అమ్మే మా అమ్మ అంటూ అందరికీ సరికొత్తగా పరిచయం చేశారు.

ఫోటో అనగానే వినయంగా యూనిట్ టెస్ట్ లో ఫస్ట్ మర్క్స్ వచ్చిన స్టూడెంట్ లాగా...కొత్త బట్టలు వేసుకున్న చిన్న పాప లాగా బిగుసుకుపోయిన ఈ అమ్మ మా అమ్మ. మా ఇంటికి అమ్మ. హ్యాపీ బర్త్ డే అమ్మ. వి లవ్ యూ సో మచ్.
నాని
రీసెంట్‌గా గ్యాంగ్ లీడర్ మూవీతో ప్రేక్షకులను నవ్వించిన నాని.. ప్రస్తుతం 'వి' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబు కూడా హీరో పాత్ర పోషిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావు హీరోయిన్లు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

First published:

Tags: Nani, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు