TOLLYWOOD STAR LYRICIST CHANDRABOSE IN COMEDIAN ALI SHOW ALITHO SARADAGA NR
Alitho Saradaga - Chandrabose: ఎందుకు వస్తారయ్యా.. తొలినాళ్లలో చంద్రబోస్కు ఘోర అవమానం?Alitho Saradaga - Chandrabose: ఎందుకు వస్తారయ్యా.. తొలినాళ్లలో చంద్రబోస్కు ఘోర అవమానం?
Alitho Saradaga - Chandrabose
Alitho Saradaga - Chandrabose: తెలుగు సినీ సింగర్ చంద్ర బోస్ గురించి, ఆయన పాడే పాటల గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈయన పాటలకు రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఎన్నో సినిమాలలో పాటలు పాడి మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
Alitho Saradaga - Chandrabose: తెలుగు సినీ సింగర్ చంద్ర బోస్ గురించి, ఆయన పాడే పాటల గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈయన పాటలకు రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఎన్నో సినిమాలలో పాటలు పాడి మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈయన మరో తెలుగు సినీ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సుచిత్రా చంద్రబోస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజ్ మహల్ సినిమా ద్వారా తొలిసారిగా సిటీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత బావగారు బాగున్నారా, పెళ్లి సందడి, ప్రేమంటే ఇదేరా, మాస్టర్ ఇలా ఎన్నో మంచి హిట్లు అందుకున్న స్టార్ హీరోల సినిమాలలో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకున్నాడు చంద్రబోస్. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న మరో పెళ్లిసందడి సినిమాలో కూడా తన సంగీతాన్ని వినిపించాడు.
ఇదిలా ఉంటే ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే రియాలిటీ షో గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ షోలో ఆలీ హోస్టింగ్ చేస్తున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. అందులో సింగర్ చంద్రబోస్ ఎంట్రీ ఇచ్చి ఎంట్రీ తోనే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక తన వ్యక్తిగత విషయాలను పంచుకోగా అతి చిన్న వయసులో మంచి రైటర్ గా పేరు సంపాదించుకున్నది చంద్రబోసే అని తెలిపాడు ఆలీ.
ఇక తన మొదటి పాటను బాలు గారు, చిత్ర గారు పాడారట. చంద్రబోస్ పన్నెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు తానే సొంతంగా వార్తలు రాసి న్యూస్ పేపర్ నే స్టార్ట్ చేశాడట. తన తల్లిదండ్రులు వాళ్ళ పనుల నుండి ఇంటికి వచ్చాక వారి మాటలను జాగ్రత్తగా విని వాటిని రాసుకొని తమ ఇంటి పక్కన ఉన్న ఒక గ్రంథాలయంలో రాసుకున్న పత్రికలు వేసేవాడట. తమ ఊరి పెద్దలు అందరూ వచ్చి తన పత్రికను మొదటిగా చదివేవారట. అలా తనకు చాలా సంతోషంగా అనిపించిందని.. కానీ ఓసారి కథ మొత్తం అడ్డం తిరిగిందని తెలిపాడు.
సుకుమర్ సినిమా వన్ నేనొక్కడినే లో యు ఆర్ మై లవ్ పాటకు తనకు 29 రోజులు పట్టిందని తెలిపాడు. ఇక అదే దర్శకుడి సినిమా రంగస్థలంలో ఒక్కో పాటకు 30 నిమిషాలు పట్టిందని తెలిపాడు. ఒక్క పాట కూడా పేపర్ పై రాయకుండా పాడాడట. ఇక తను పాడిన ఒక పాటకు రెహమాన్ పొగిడాడని తెలిపాడు చంద్రబోస్. ఆలీ కోసం కూడా ఒక పాట పాడి వినిపించారు చంద్రబోస్. తనను ఇండస్ట్రీలో పాట పాడక ముందే ఒకరు విమర్శించారని తెలిపాడు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.