టాలీవుడ్ స్టార్ హీరోలకు కరోనా షాక్... నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత ప్రజలు తమ ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారనే వాదన ఇప్పటికే వినిపిస్తోంది.

news18-telugu
Updated: April 7, 2020, 7:45 PM IST
టాలీవుడ్ స్టార్ హీరోలకు కరోనా షాక్... నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
చిత్ర పరిశ్రమ లోగో
  • Share this:
కరోనా ఎఫెక్ట్ ఆర్థిక రంగంపై ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న కరోనా ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా ఎఫెక్ట్ సినీ రంగంపై కూడా పిడుగులా పడింది. ఇప్పటికే రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు ఆగిపోయాయి. షూటింగ్స్ ఆగిపోయి... వాటిపై ఆధారపడే కార్మికుల జీవితాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వీరికి ఆదుకునేందుకు సినీ రంగంలోని ప్రముఖులు ముందుకు రావడం కొంత ఊరట కలిగించే విషయం. ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ కరోనా ప్రభావం టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, దర్శకుల రెమ్యూనరేషన్లపై గట్టిగానే ప్రభావం చూపించే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత ప్రజలు తమ ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారనే వాదన ఇప్పటికే వినిపిస్తోంది. అదే నిజమైతే... నిత్యవసరం కాని సినిమాపై మూవీ లవర్స్ ఎంత మేరకు డబ్బు ఖర్చు చేస్తారనేది కూడా సందేహంగా మారింది. కరోనా పోయినా... ఆ భయం కారణంగా ప్రేక్షకులు కొన్నేళ్ల పాటు ధియేటర్లకు దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. సినీ నిర్మాతలు కూడా ఇదే రకమైన అంచనాతో ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఓ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న దిల్ రాజు... సినిమా కలెక్షన్లపై కరోనా ప్రభావం ఏ రకంగా ఉంటుందనే విషయం రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైతే తప్ప తెలియదని అన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలకు కరోనా షాక్... నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు | Tollywood star heros may cut their remunerations if corona effect remains on audience for some more time ak
దిల్ రాజు (ఫైల్ ఫోటో)


ఒకవేళ అప్పటికీ కరోనా ప్రభావం సినిమాలపై ఉంటే... ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారి రెమ్యూనరేషన్లు తగ్గే అవకాశం ఉందంటూ... పరోక్షంగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు కూడా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పటి పరిస్థితిని బట్టి సినిమాల బడ్జెట్‌ను తగ్గించుకోవాల్సి ఉంటుందని అన్నారు. మిగతా వారి రెమ్యూనరేషన్ల సంగతి ఎలా ఉన్నా... ఒకవేళ కోత మొదలైతే అది స్టార్ హీరోలపైనే ఎక్కువ ప్రభావం చూపించొచ్చనే వాదన కూడా ఉంది. మన టాలీవుడ్‌లో ఓవర్సీస్ మార్కెట్ అయిన అమెరికాలోనూ పరిస్థితులు చక్కబడేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో... కరోనా ఎఫెక్ట్ టాలీవుడ్ స్టార్ హీరోలకు రెమ్యూనరేషన్ల పరంగా షాక్ ఇవ్వొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading