• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TOLLYWOOD STAR HEROS BALAKRISHNA PRABHAS AND MAHESH BABU LOVES TO EAT CHICKEN DUM BIRYANI NR

Balakrishna - Prabhas - Mahesh babu: బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబు అందరికీ అది అంటేనే ఇష్టమట.. అదిలేకుంటే ఉండలేరట?

Balakrishna - Prabhas - Mahesh babu

Balakrishna - Prabhas - Mahesh babu: హీరోలు తాము నటించే సినిమాల విషయంలోనే కాకుండా తమ నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ పెడుతుంటారు. ధరించే దుస్తుల నుండి తినే ఆహారం వరకు ప్రతి ఒక్క విషయం పై ఎంతో కేరింగ్ తీసుకుంటారు.

  • Share this:
    Balakrishna - Prabhas - Mahesh babu: హీరోలు తాము నటించే సినిమాల విషయంలోనే కాకుండా తమ నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ పెడుతుంటారు. ధరించే దుస్తుల నుండి తినే ఆహారం వరకు ప్రతి ఒక్క విషయం పై ఎంతో కేరింగ్ తీసుకుంటారు. ఇక వాళ్ళు తినే విషయంలో కూడా ప్రత్యేకమైన డైట్ తీసుకుంటారు. ప్రతి ఒక్క నటులు తమ వ్యక్తిగత జీవితంలో ఆహారం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారో.. ఒకానొక సమయంలో తమకు ఇష్టమైన ఫుడ్ కనిపిస్తే వెంటనే వారి డైట్ ను మర్చిపోతుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ లకు మాత్రం ఎవరైనా లొంగి పోవాల్సిందే. సెలబ్రిటీల విషయంలోనే కాదు సామాన్యులు కూడా ఇష్టమైన ఫుడ్ కనిపిస్తే చాలు వాటికి లొంగి పోవాల్సిందే. ఇదిలా ఉంటే బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబు లు కూడా ఒకే రకమైన ఆహారాన్ని ఇష్టపడతారట. ఇంతకు ఏంటో తెలుసుకుందాం..

    బాలకృష్ణ : తెలుగు సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే వరుస సినిమాల్లో బిజీగా ఉన్న బాలయ్య మొత్తానికి టాలీవుడ్ లో మంచి స్టార్ హీరోగా నిలిచాడు. ఇక ఈయనకు ఉన్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే బాలయ్య తను తీసుకునే ఆహార పదార్థాలలో ఎక్కువగా రొయ్యలను ఇష్టపడతారట. ఇక చికెన్ బిర్యాని కూడా బాలయ్య బాగా ఇష్టపడతారట.

    ప్రభాస్: ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా అందనంత ఎత్తులో ఉన్న ప్రభాస్.. వరుస సినిమాలతో పైగా పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ కూడా బిర్యాని ఎంతో ఇష్టపడతాడు అని తెలిసింది. అంతేకాకుండా సీఫుడ్, రోడ్ సైడ్ పానీపూరి కూడా బాగా ఇష్టంగా తింటాడని తెలిసింది. ఈయన నటించిన బాహుబలి సినిమా కోసం కూడా సరైన ఫిట్ కోసం కొన్ని రకాల బిర్యానీ తిన్న సంగతి తెలిసిందే.

    మహేష్ బాబు: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు. ప్రస్తుతం పలు అవకాశాలు అందుకుంటూ తెగ బిజీగా ఉన్నాడు. ఇక మహేష్ బాబు తను తీసుకున్న ఆహార విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. ఇక ఆయన తీసుకునే కొన్ని ఆహార పదార్థాలను డైట్ ఫిషియల్ సలహాల ప్రకారమే తీసుకుంటారు. ఇక ఈయన కి చేపల పులుసు, బిర్యానీ అంటే బాగా ఇష్టమట.
    Published by:Navya Reddy
    First published: