ఆ విషయంలో...కాజల్,పూజా హెగ్డే ఏ మాత్రం తగ్గడంలేదుగా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు..కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఓ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు..వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 18, 2019, 2:24 PM IST
ఆ విషయంలో...కాజల్,పూజా హెగ్డే ఏ మాత్రం తగ్గడంలేదుగా..
పూజా హెగ్డే,కాజల్ అగర్వాల్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు..కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఓ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు..వివరాల్లోకి వెళితే.. ముందుగా పూజా హెగ్డే విషయానికొస్తే..మోడల్‌గా గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన  పూజా హెగ్డే.. 2012లో ‘ముగమూది’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత 2014లో నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ముకుందా’ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌తో పాపులర్ అయింది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘డీజే’ సినిమాతో పూజాకు బ్రేక్ వచ్చింది.ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’లో నటించింది. హిందీలో అక్షయ్ హీరోగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా టాప్‌ హీరోల సరసన నటిస్తూ మంచి ఫాంలో ఉన్న పూజా పది రోజుల కాల్షిట్స్‌ కోసం ఏకంగా కోటిన్నర ఆఫర్ చేస్తోందట. ఈ మధ్య ఒక మీడియం రేంజ్ సినిమా నిర్మాతలు పూజని సంప్రదించగా వారు ఈ అమ్మడు అడిగిన పారితోషకం చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందట. తాజాగా ఈ భామ.. మెగా హీరో వరుణ్ తేజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వాల్మీకీ’ సినిమాలో ఓ సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో నటించేందుకు పూజా హెగ్డే కోటీ యాబై లక్షల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Tollywood Star Heroines Kajal agarwal and pooja hegde charges more remuneration for films..here are the details,ismart shankar movie review,kajal aggarwal remunaration,pooja hegde remunaration,ram ismart shankar,pooja hegde,kajal aggarwal,kajal agarwal,kajal agarwal instagram,kajal agarwal facebook,kajal agarwal twitter,kajal agarwal age,kajal agarwal hot,pooja hegde instagram,pooja hegde facebook,pooja hegde twitter,pooja hegde hot,pooja hegde age,pooja hegde size,kajal,pooja hegde movies,kajal agarwal movies,kajal agarwal movies in hindi dubbed,pooja hegde hot,pooja hegde kiss,pooja hegde songs,pooja hegde item song,pooja hegde and kajal aggarwal,pooja hegde upcoming movies list,pooja hegde movies in hindi dubbed,kajal aggarwal house,kajal aggarwal songs,kajal aggarwal hot,kajal aggarwal movies,kajal aggarwal workout video,tollywood,telugu cinema,పూజా హెగ్డే,కాజల్ అగర్వాల్,పూజా హెగ్డే రెమ్యునరేషన్,కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్,కాజల్ అగర్వాల్ పూజా హెగ్డే,కాజల్ అగర్వాల్ పారితోషకం,పూజా హెగ్డే పారితోషకం,
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే (ఫైల్ ఫోటోస్)


ఇదిలా ఉంటే కథానాయికగా పుష్కర కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కాజల్‌ అగర్వాల్..  సినిమాల పరంగా అర్ధసెంచరీ ఎపుడో దాటేసింది. ఈ మధ్య పెద్దగా విజయాలులేని ఈ భామ ప్రస్తుతం హిందీలో సంచలన విజయాన్ని సాధించిన ‘క్వీన్‌’ తమిళ రీమేక్  ‘ప్యారీస్‌ ప్యారీస్‌’ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకుంది.  వీటితో పాటు ఈ అమ్మడు  తమిళంలో జయంరవి సరసన ‘కోమాలి’తో పాటు తెలుగులో శర్వానంద్ హీరోగా నటించిన ‘రణరంగం’ చిత్రాల్లో నటిస్తోంది.  ఈ రెండూ చిత్రాల నిర్మాణం చివరి దశకు చేరాయి. ఈ సినిమాల తరువాత మరే చిత్రాలు చేతిలో లేని ఈ బ్యూటీ పారితోషికం విషయంలో ఇప్పటికీ  ఏ మాత్రం తగ్గడం లేదని టాక్. తెలుగులో ‘రాజుగారి గది 3’ చిత్రంలో ముందుగా  నటించే అవకాశం కాజల్‌కే వచ్చిందట. కానీ..ఈ అమ్మడు అడిగిన పారితోషికం ఆ చిత్ర నిర్మాతలకు స్పృహ తప్పేలా చేసిందట. దీంతో అంతకన్నా తక్కువ పారితోషికానికి నటించే వేరే నటిని చూసుకుంటామని ఆ చిత్ర నిర్మాతలు వెళ్లిపోయినట్లు సమాచారం. పారితోషికం తగ్గిస్తే మార్కెట్‌ తగ్గిపోయిందని ప్రచారం చేస్తారనే భయమో, లేక తన క్రేజ్‌ ఇంకా తగ్గలేదనే ధీమానో కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కాజల్ ఏమాత్రం తగ్గడం లేదనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.మరో పక్క అవకాశాల గాలం కోసం కాజల్‌ అగర్వాల్‌ కొత్త కొత్తగా ఫొటో సెషన్లు తీయించుకుంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వార్తల్లో నలిస్తూనే ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 18, 2019, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading