Home /News /movies /

TOLLYWOOD STAR HEROINE SAMANTHA SKIPPED FAMILY DINNER WITH AAMIR KHAN NR

Akkineni Samantha: అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీలో సమంత మిస్సింగ్.. విడాకులపై క్లారిటీ ఇచ్చేసిందా?

Akkineni Samantha

Akkineni Samantha

Akkineni Samantha: అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ ప్రేమ కథ చిత్రం "లవ్ స్టోరీ". ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయోత్సవం సందర్భంగా అక్కినేని నాగార్జున ఇంటా డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
    Akkineni Samantha: అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ ప్రేమ కథ చిత్రం "లవ్ స్టోరీ". ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయోత్సవం సందర్భంగా అక్కినేని నాగార్జున ఇంటా డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.ఈ పార్టీలో భాగంగా లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, లవ్ స్టోరీ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల, అఖిల్, నాగ చైతన్య, నాగార్జున, సాయి పల్లవి కనిపించి సందడి చేశారు. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫ్యామిలీ డిన్నర్ పార్టీలో సమంతా కనిపించకపోవడం గమనార్హం.

    శ్రీవేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ ఈ చిత్రం నిర్మించగా ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న సందర్భంగా చిత్ర బృందం ఈ వేడుకను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాగచైతన్య రేవంత్ అనే పాత్రలో ఒక మధ్య తరగతి కుటుంబంలోని యువకుడిగా కనిపించారు. ఇక సాయి పల్లవి నటన గురించి అందరికీ తెలిసిందే. ఇలా క్లాసికల్ ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో చిత్రబృందం విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

    ఇది కూడా చదవండి: వీళ్ళు విడిపోతారని మూడేళ్ల ముందే చెప్పా.. సామ్, చైతు విడాకులపై వేణు స్వామి షాకింగ్ వీడియో?

    ఈ క్రమంలోనే ఈ పార్టీలో సమంత కనిపించకపోవడం మరోసారి అనుమానాలకు దారి తీస్తోంది. గత కొద్దిరోజుల నుంచి సమంత నాగచైతన్య పై వస్తున్న వార్తలు రోజురోజుకు అవి నిజమేనని బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పటివరకు సాయి పల్లవి చైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్ లో పాల్గొనకపోవడం, నాగార్జున పుట్టినరోజు వేడుకలలో పాల్గొనకపోవడం, ఇక తాజాగా డిన్నర్ పార్టీలో కూడా సమంత లేకపోవడంతో వీరి గురించి వస్తున్న వార్తలపై మరిన్ని అనుమానాలను పెరుగుతున్నాయి.

    ఇది కూడా చదవండి:ఆ ఒక్క మాటతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఇండస్ట్రీ డౌట్స్ అన్ని క్లియర్!

    ఇలా వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో రోజురోజుకు వీరి గురించి వస్తున్న వార్తల వల్ల తనకు తన భర్త నాగచైతన్యకు పరువు నష్టం కలుగుతుందని,ఇప్పటికీ ఈ విషయంపై సైలెంట్ గా ఉంటే మరిన్ని దిగజారిన వార్తలు రాస్తారని ఈ వార్తలకు అడ్డుకట్ట వేయడం కోసం సమంత కోర్టును ఆశ్రయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Aamir Khan, Akkineni samantha, Naga Chaitanya, Nagarjuna Akkineni, Tollywood

    తదుపరి వార్తలు