Samantha Akkineni: టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత పరిచయం అందరికి తెలిసిందే. ఇక తన అందం, ఆరోగ్యం విషయం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈమధ్య సినిమాలపై అవకాశాలు ఎక్కువగా చూపియని సమంత.. ప్రస్తుతం ఒకే సినిమాతో బిజీగా ఉంది. ఇక ఎక్కువ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తుంది. అంతేకాకుండా సోషల్ సర్వీస్ లంటూ బాగా బిజీ గా మారింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది.
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి సమంత ప్రజలకు కొన్ని విషయాలు పంచుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అందరికీ తెలిసిందే. ఇక సరైన వైద్యం దొరకక ఎంతోమంది బాధితులు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఆక్సిజన్ కొరత వల్ల, వైరస్ సోకిన భయం వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక వీటి నుండి తప్పించుకోవడానికి అక్కినేని కోడలు రెండు సలహాలు మనసులో ఉంచుకోమని పంచుకుంది. మనిషికీ హోప్, పాజిటివిటీ ఈ రెండు ఉంటే ఇటువంటి కష్ట కాలం నుంచి త్వరగా బయటపడగలరని తెలిపింది.
ఇక తను కూడా ఓజీవి న్యూట్రిషన్ వల్ల తన ఆరోగ్యం, రోగనిరోధకశక్తిని పెంచుతుందట. మంచి పోషకాలు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపింది. ఇక తన ఫ్యామిలే కాకుండా అభిమానులందరూ ఆరోగ్యంగా, దూరంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా ఉండాలని తెలిపింది. ఇక తన ప్రయాణంలో ఓజీవా న్యూట్రిషన్ ఉండటం వల్ల తనకు కావలసిన పోషక విలువలు అందుతున్నాయని.. ఆరోగ్యం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఇక సమంత ప్రస్తుతం శాకుంతలం, కాథువాకుల రెండు కాదల్ అనే వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఓ వెబ్ సిరీస్ లో నటించగా అది కూడా త్వరలోనే విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Covid-19, Samantha akkineni, Shakunthalam movie