Home /News /movies /

Rashi Khanna: ఎదుగుతున్న సమయంలో ఆ విషయం తెలిసిందంటున్న రాశి ఖన్నా!

Rashi Khanna: ఎదుగుతున్న సమయంలో ఆ విషయం తెలిసిందంటున్న రాశి ఖన్నా!

rashi khanna

rashi khanna

Rashi Khanna: టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా గురించి అందరికీ తెలిసిందే. అతి తక్కువ సమయంలో తన నటన తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

    Rashi Khanna: టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా గురించి అందరికీ తెలిసిందే. అతి తక్కువ సమయంలో తన నటన తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో సొంతం చేసుకుంది. ఇక రాశి సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది.

    హిందీ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కూడా అతిధి పాత్రలో పరిచయం అయ్యింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా నటించి తన నటనకు వరుస సినిమా అవకాశాలను సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, బికినీ అందాలను షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్య పరుస్తుంది. అంతేకాకుండా బొద్దుగా ఉండే రాశిఖన్నా ఈమధ్య సన్నబడి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇదిలా ఉంటే నిజమైన ప్రేమ విషయంలో చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిన రాశిఖన్నా కొన్ని విషయాలు పంచుకుంది.

    ఈరోజు రాశి ఖన్నా తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా ఎమోషనల్ గా ఫీల్ అయింది. ఇక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన తల్లిదండ్రుల ఫోటో షేర్ చేస్తూ కొన్ని విషయాలు పంచుకుంది. ఎంతో గొప్ప, అద్భుతమైన తల్లిదండ్రులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ, నిజమైన ప్రేమకు మంచి చిహ్నాలు మీరే అంటూ, మేం ఎదుగుతున్న సమయంలో మీ మధ్య కూడా ప్రేమ పెరుగుతూనే ఉంది. అది నేను చూశాను అంటూ నిజమైన ప్రేమ ఇంకా ఈ ప్రపంచం లోనే ఉందనే విషయాన్ని మీ వల్లే నేను తెలుసుకున్నాను అంటూ, నిజమైన ప్రేమ ఉందని నమ్మనంటూ రాశిఖన్నా ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Interesting comments, Parents wedding anniversary, Rashi khanna, Tollywood star heroine

    తదుపరి వార్తలు