TOLLYWOOD STAR HEROINE RAKUL PREETH REJECTS HERO NANDAMURI BALAKRISHNA FILM NR
Rakul Preet Singh: బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. నెటిజన్లు ఫైర్..?
Rakul Preet Singh
Rakul Preet Singh:టాలీవుడ్ బ్యూటీ నటి రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
Rakul Preet Singh:టాలీవుడ్ బ్యూటీ నటి రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అతి తక్కువ సమయం లో మంచి పేరు సంపాదించుకున్నా ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా తెగ బిజీ గా ఉంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఏకంగా బాలయ్య మూవీనే వదులుకుంది.
2009 లో కన్నడ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం కాగా ఆ తరువాత 2011 లో కెరటం మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తో మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత వరుస అవకాశాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో అర్జున్ కపూర్ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా పలు సినిమాలో కూడా బిజీగా ఉంది.
కానీ ఈ అమ్మడు బాలయ్య సరసన అవకాశాన్ని వదులుకుంది. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టి చేయాలనుకుంటున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా కోసం శృతిహాసన్ ను సంప్రదించగా ప్రస్తుతం తను మరో సినిమాలో బిజీగా ఉండటంవల్ల డేట్స్ కుదరక పోవడంతో నో చెప్పింది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించగా ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుస సినిమాలలో బిజీగా ఉన్నందున బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసింది. ఇక దీనితో బాలయ్య అభిమానులు, నెటి జనులు రకుల్ ప్రీత్ సింగ్ పై తెగ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య సరసన అవకాశాన్ని వదులుకునందుకు తెగ ఫైర్ అవుతున్నారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.