• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD STAR HEROINE NIDHHI AGERWAL REVEALS ABOUT HER BEAUTY SECRETS NR

Nidhhi Agerwal: బ్యూటీ సీక్రెట్స్ చెప్పేసిన నిధి అగర్వాల్.. అలాంటి వాటితో?

Nidhhi Agerwal: బ్యూటీ సీక్రెట్స్ చెప్పేసిన నిధి అగర్వాల్.. అలాంటి వాటితో?

Nidhhi Agerwal

Nidhhi Agerwal: టాలీవుడ్ నటి ఇస్మార్ట్ గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్.. తన అందంతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది.

  • Share this:
    Nidhhi Agerwal: టాలీవుడ్ నటి ఇస్మార్ట్ గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్.. తన అందంతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది. మోడల్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. తన నటన విషయంలో మొదటగా అంత సక్సెస్ అందుకోలేని ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

    మొదట హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత సవ్యసాచి ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. కానీ ఈ సినిమా తనకు అంత సక్సెస్ ఇవ్వకపోగా.. ఆ తర్వాత ఏడాది మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా కూడా తనకు అంతగా గుర్తింపు తేలేకపోయింది. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ లో నటించడమే కాకుండా తన గ్లామర్ ను ఈ సినిమా ద్వారా మరింత పరిచయం చేసింది.




    ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సోషల్ సర్వీస్ వంటి విషయంలో ముందుంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో వీడియోను సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయగా.. అందులో బ్యూటీ సీక్రెట్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది. చర్మ సౌందర్యం గురించి కొన్ని రహస్యాలు తెలుపుతూ, క్యారెట్ తో చేసిన సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ క్రీమ్ గురించి కొన్ని విషయాలు తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది.
    Published by:Navya Reddy
    First published: