హోమ్ /వార్తలు /సినిమా /

Ante Sundaraniki: 'అంటే సుందరానికి' నో చెప్పిన హీరోయిన్.. కారణం ఏంటో తెలుసా?

Ante Sundaraniki: 'అంటే సుందరానికి' నో చెప్పిన హీరోయిన్.. కారణం ఏంటో తెలుసా?

antey sundariniki

antey sundariniki

Ante Sundaraniki: ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు షూటింగ్ బిజీలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇక నాచురల్ స్టార్ హీరో నాని వరుస సినిమాల్లో బిజీగా ఉండగా..

Ante Sundaraniki: ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు షూటింగ్ బిజీలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇక నాచురల్ స్టార్ హీరో నాని వరుస సినిమాల్లో బిజీగా ఉండగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అంటే సుందరానికి ' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కోలీవుడ్ నటి నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా లో ఓ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం సినీ బృందం హైదరాబాద్ లో ఉంది.


మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ ఈ సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నా నజ్రియా.. ఆమె డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగులో రాజా రాణి సినిమా లో కనిపించింది. ఇక నేరుగా తెలుగు సినీ పరిశ్రమకు ఈ సినిమాతో పరిచయం కాగా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న.. ఈ సినీ బృందం పలు జాగ్రత్తలతో సినిమా షూటింగ్ చేయాలని భావించారట. కానీ హీరోయిన్ నజ్రియా ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. కానీ ఈ పరిస్థితిలో షూటింగ్ లో పాల్గొననని చెప్పేసిందట.


దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక హీరో నాని కూడా ఈ సినిమాకు బ్రేక్ చెప్పగా.. బృందం కూడా ఈ సినిమాను వాయిదా వేశారట. అంతేకాకుండా నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న మరో సినిమా టక్ జగదీష్ కూడా వాయిదా పడగా.. మరో సినిమా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శ్యామ్ సింగరాయ్ ను కూడా కోవిడ్ కారణంగా వాయిదా వేశారట. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలావరకు సినిమాలు వాయిదా పడ్డాయి.

First published:

Tags: Ante Sundaraniki Shooting, Corona effect, Hero nani, Nani

ఉత్తమ కథలు