Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. గత 15ఏళ్లుగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన నటనతో, అందంతో ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది ఈ కలువ కళ్ళ సుందరి. గత సంవత్సరం పెళ్లి చేసుకున్న అవకాశాలు ఏ మాత్రం తగ్గకుండా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయ్ కాజల్ కు. అలాంటి ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో కరోనా వైరస్ గురించి ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. వయసు వ్యత్యాసం లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు మాస్క్ ధరించకుండా ఉన్న వారికీ కరోనా వ్యాపిస్తుంది. గత సంవత్సరంతో పోతే ప్రస్తుతం మారింత దారుణంగా తయారయింది కరోనా వైరస్. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలలో 50 శాతం వరకు కరోనా బారిన పడ్డారు. ఇక ఈ నేపథ్యంలో కరోనా వైరస్ రాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ కరోనాతో బేరాలు వద్దంటూ కాజల్ అగర్వాల్ ఇలా పోస్ట్ చేసింది.
View this post on Instagram
ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచాన్ని భయానకంగా చేసింది. ఎవరు ఊహించని రీతిలో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ప్రమాదకరంగా మారింది. ఈ సమయంలో మన కోసం ఎంతో శ్రమించే మన ఆరోగ్య వ్యవస్దను కాపాడుకోవడానికి ఇంట్లోనే ఉండి జాగ్రత్త పడుదాం. మీ జీవితంలో మీరు ఎప్పుడైన త్యాగం చేశారా ? ఒక అమ్మాయిని వేరే ఇంటికి పంపించడం.. కాలేజీకి మన సోదరులను పంపడం.. పెంపుడు జంతువుకు ఎక్కువ కాలం వ్యాధి ఉండటం.. వయసు మళ్ళిన అమ్మమ్మ, తాతయ్యలకు అపార్థం చేసుకోవం, మీరు ప్రేమించే వ్యక్తి మౌనం వహించడం వంటివి జరిగితే మీకు నష్టం అంటే ఏంటో తెలుస్తుంది. కరోనా మీరు ఊహించినట్టు మీ ముందుకు రాదు.. అది రూపం మార్చుకుంటుంది. విషాదంతో బేరాలు వద్దు బాధ మనకే గ్రహాంతరవాసికి కాదు అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Corona virus, Covid-19, Instagram post, Kajal Aggarwal, Tollywood, Viral post