Home /News /movies /

TOLLYWOOD STAR HEROINE AKKINENI SAMANTHA REQUEST FANS TO NOT EAT NON VEG NR

Akkineni Samantha: అది పూర్తిగా తగ్గిస్తే మంచిది... అభిమానులకు సమంత సలహాలు?

Samantha Akkineni

Samantha Akkineni

Akkineni Samantha: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిన సమంత ప్రస్తుతం పలు అవకాశాలు అందుకుంటోంది.

    Akkineni Samantha: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిన సమంత ప్రస్తుతం పలు అవకాశాలు అందుకుంటోంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

    పెళ్లి తర్వాత సమంత మరింత గ్లామర్ తో రెచ్చిపోతుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతుంది. అంతేకాకుండా తన హెల్త్ గురించి బాగా శ్రద్ధ తీసుకుంటుంది. ప్రతిరోజు వర్క్ అవుట్ లతో బాగా బిజీగా ఉంటుంది. ఇక సమంత తన ఇంట్లో గార్డెనింగ్ కూడా ఏర్పాటు చేసుకుంది. వాటితో బాగా సమయాన్ని గడుపుతుంది. అంతేకాకుండా గార్డెనింగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మాంసాహారాన్ని తగ్గించుకోమని సలహా ఇచ్చింది ఈ బ్యూటీ.

    ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు వాయిదా పడటంతో ఇంట్లోనే ఉంటూ ప్రజలకు ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తుంది. ఇక తాజాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొగా హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ లో సమంత తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సమంత కొన్ని విషయాలు పంచుకోగా.. ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి అందరినీ ఎంతగానో మార్చిందని తెలిపింది.



    తన ఇంట్లో పచ్చదనాన్ని స్వాగతించామంటూ.. ఫుడ్ పట్ల తనకున్న అభిప్రాయాలను సమూలంగా మార్చిందని తెలిపింది. ఇక తన ఆహారం తానే పండించుకుంటున్నానని తెలిపింది. వాటి కోసం హైడ్రోఫోనిక్ సాంకేతికతను వినియోగిస్తుందట. దీనివల్ల వినియోగించే నీటిలో 5 శాతమే వాడుతున్నామని తెలిపింది. ఇక తను పూర్తిగా నాన్ వెజ్ కు దూరంగా ఉంటుందట. తనలో వచ్చిన ఈ మార్పును తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని తెలిపింది. ఇక అందరూ మాంసాహారం తగ్గించుకోండి అంటూ అవసరమైనప్పుడు మాత్రమే కొనండి అని అంతేకాకుండా మీ ఆహారం మీరే పండించుకొండి అని ప్రజలకు సలహా ఇచ్చింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Family man 2 series, Samantha akkineni, World environmental day

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు