హోమ్ /వార్తలు /సినిమా /

MAA Elections 2021: మా ఎన్నికలకు స్టార్ హీరోలు దూరం.. ఎన్టీఆర్‌తో పాటు వాళ్లు కూడా ఓటేయరా..?

MAA Elections 2021: మా ఎన్నికలకు స్టార్ హీరోలు దూరం.. ఎన్టీఆర్‌తో పాటు వాళ్లు కూడా ఓటేయరా..?

‘మా’ ఎలక్షన్స్‌లో ఎన్టీఆర్ ఓటు ఎవరికి (Twitter/Photo)

‘మా’ ఎలక్షన్స్‌లో ఎన్టీఆర్ ఓటు ఎవరికి (Twitter/Photo)

MAA Elections 2021: నిండా 1000 మంది కూడా సభ్యులు లేని అసోసియేషన్ ఎన్నికల (MAA Elections 2021) కోసం ఇన్ని రాజకీయాలు చేయడం ఏంటని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అసలు ఇంత తక్కువ మంది ఉన్న అసోసియేషన్ ఎలక్షన్స్ జరగాల్సిన తీరు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...

మా ఎన్నికలు జరుగుతున్న తీరు చూసిన తర్వాత ఎవరికైనా ఇలాంటి అనుమానాలు రావడం సహజమే. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి జరుగుతున్న రచ్చ అలా ఉంది మరి. నిండా 1000 మంది కూడా సభ్యులు లేని అసోసియేషన్ ఎన్నికల కోసం ఇన్ని రాజకీయాలు చేయడం ఏంటని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అసలు ఇంత తక్కువ మంది ఉన్న మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరగాల్సిన తీరు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి మా సభ్యుల మాటలు కూడా కోటలు దాటుతున్నాయి. కొందరు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. మీరు ఇలా అంటే మీరేం తక్కువ కాదు.. మీ బతుకులు ఇవి అంటూ మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల కారణంగా ఎవరో బయటి వాళ్లు వచ్చి మా అసోసియేషన్ పరువు తీయాల్సిన అవసరం లేదు వాళ్లకు వాళ్ళే తీసుకుంటున్నారంటూ కామన్ ఆడియన్స్ మాట.

అసలు ఇలా కూడా విమర్శించుకుంటారా.. పొద్దున్నే లేస్తే మేమంతా ఒక్కటే.. మా కళామతల్లి ఈ స్థాయి మాకు ఇచ్చింది.. అందరం కలిసే ఉంటాం అంటూ కబుర్లు చెప్తుంటారు. కానీ ఇలాంటి సమయంలోనే ఎవరు ఎలాంటి వాళ్లు అనేది బయటికి వస్తుందని అంతా అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు ఫైట్ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. మంచు విష్ణుకు పోటీగా నిలబడిన ప్రకాశ్ రాజ్‌ను చిరంజీవి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారిపోయిందిప్పుడు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్ విష్ణు గుర్తు పెట్టుకో అంటూ ప్రకాశ్ రాజ్ మాట్లాడాడు.

Hyper Aadi - Anasuya Bharadwaj: హైపర్ ఆదిపై అనసూయ సీరియస్ అయిందా.. ఇంకోసారి స్కిట్ పేరుతో ఇలా చేస్తే..?


ఆయన బిపి మాత్రలు వేసుకుని రావడం మరిచిపోయాడంటూ విష్ణు కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి మాటలు చాలానే ఉన్నాయి. మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై కూడా సీరియస్ అయ్యాడు ప్రకాశ్ రాజ్. ఎక్కడి నుంచో వచ్చిన వాడు మా పీఠంపై కూర్చుంటానంటే కుదరదు అంటూ నరేష్ అంటే.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమంటూ సీరియస్ అయ్యాడు ప్రకాశ్ రాజ్. అంతేకాదు.. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల మధ్య కూడా అలాగే మాటల యుద్ధం జరుగుతుంది. ఇదంతా చూసిన తర్వాత స్టార్ హీరోలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. ఇదేంటి ఎన్నికల కోసం మరీ రోడ్డెక్కి కొట్టుకుంటున్నారంటూ కొందరు హీరోలు సీరియస్ అవుతున్నారు. చిరంజీవి అంటే క్రమశిక్షణ సంఘానికి లేఖ కూడా రాసాడు.

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై నిర్మాతలు సంచలనం.. నిషేధమే నిర్ణయమా..?


ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఓటేయడానికి రానని ముందుగానే చెప్పినట్లు జీవిత మీడియా ముందు తేల్చి చెప్పింది. ఈయన మాత్రమే కాదు.. మరికొందరు స్టార్ హీరోలు కూడా మా ఎన్నికల్లో ఓటేయడానికి రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అందులో మహేష్ బాబు, నాగార్జున, కళ్యాణ్ రామ్ లాంటి వాళ్లు కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఎన్నికల జరగనున్నాయి. చిరంజీవి కుటుంబం మాత్రమే పూర్తిగా మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతుందని.. మిగిలిన వాళ్లలో చాలా వరకు ఓట్లు ఈ సారి రావడం కష్టమే అంటున్నారు మా సభ్యులు. చూడాలిక.. స్టార్ హీరోల తీర్పు ఈసారి ఎలా ఉండబోతుందో..?

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: MAA Elections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు