ఆ స్టార్ హీరో భార్య చిచ్చు.. ముక్కలైన బడా నిర్మాణ సంస్థ..

ఆడాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయంటారు.. ఇక నిర్మాణ సంస్థలు ఓ లెక్క. అందులోనూ మన ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఇంకా పవర్ ఫుల్. ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోరు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2019, 12:45 PM IST
ఆ స్టార్ హీరో భార్య చిచ్చు.. ముక్కలైన బడా నిర్మాణ సంస్థ..
అక్రమ సంబంధం నెరిపిన సింగర్ అరెస్ట్
  • Share this:
ఆడాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయంటారు.. ఇక నిర్మాణ సంస్థలు ఓ లెక్క. అందులోనూ మన ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఇంకా పవర్ ఫుల్. ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోరు. టాలీవుడ్ హీరోల భార్యలు కూడా అలాగే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకం. పైగా వాళ్లకు సినిమా నాలెడ్జ్ కూడా ఉండటం ఇక్కడ బోనస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్టార్ హీరో భార్యకు కూడా కావాల్సినంత బ్యాగ్రౌండ్‌తో పాటు భర్త క్రేజ్.. సినిమా నాలెడ్జ్ ఉంది. దాంతో ఆమె తన భర్తకు చెప్పే కథలు కూడా వింటుంది. కానీ వేలు పెట్టి చెడగొట్టడాలు మాత్రం చేయదు. అయితే ఈ హీరోగారి భార్య వల్ల పచ్చగా ఉన్న ఓ నిర్మాణ సంస్థను ముక్కలు చేసిందని ప్రచారం జరుగుతుంది.

ఆ నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన స్టార్ హీరో భార్య


అయినా ఆడవాళ్ళ వల్ల ప్రాణంగా ఉన్న స్నేహితులే విడిపోతుంటారు.. వాళ్ల పవర్ అది. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో పాతకుపోయి ఉన్న ముగ్గురు స్నేహితులు.. ఓ బడా నిర్మాణ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్లు కలిసే సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేసారు.. కానీ కొన్నేళ్ల కింద ఉన్నట్లుండి ఆ నిర్మాణ సంస్థ ముక్కలైపోయింది.. ఓ సూపర్ స్టార్‌తో చేసిన సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో వాళ్ల మధ్య ఆర్థిక ఇబ్బందులు వచ్చి విడిపోయారని అనుకున్నారు కానీ దానికి అసలు కారణం మాత్రం సదరు స్టార్ హీరో భార్య అని తర్వాత తెలిసింది.

ఆ నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన స్టార్ హీరో భార్య


ఆ నిర్మాణ సంస్థలో అదే హీరోతో ఓ భారీ బడ్జెట్ సినిమాకు ముగ్గురు నిర్మాతలు కలిసే ప్లాన్ చేసారు కానీ ఆ తర్వాత వాళ్లు విడిపోవడంతో సినిమా కూడా ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరికి వాళ్లే యమునకు నీరే అన్నట్లుగా మారిపోయారు. ఇప్పుడు అందులో ఓ నిర్మాత అదే హీరోతో సినిమా చేస్తున్నాడు. ఆయన కూడా మన స్టార్ హీరోకు సన్నిహితుడు కావడం.. దానికితోడు హీరో భార్య ఏం చెబితే అది ఓకే అనే బ్యాచ్ కావడంతో అతడితోనే ఇప్పుడు ఈయన సినిమా చేస్తున్నాడు. అయితే ఇదంతా చేసింది ఓ పెద్ద స్టార్ హీరో భార్య కావడంతో ఎవరూ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. కానీ ఒకప్పుడు ప్రముఖంగా ఉన్న నిర్మాణ సంస్థ మాత్రం ఇప్పుడు ముక్కలు ముక్కలైపోయింది.
First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading