• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TOLLYWOOD STAR HERO VENKATESH WILL BE ACT IN WEB SERIES IN DIRECTION OF DIRECTOR VENKATESH MAHA NR

Hero Venkatesh: 'వెబ్ సిరీస్'కి సిద్దమైన వెంకీ మామ.. ఏకంగా ఆ దర్శకుడితో తీసేందుకు రెడీ!

Hero Venkatesh

Hero Venkatesh: ప్రస్తుతం బుల్లితెర, వెండితెర కంటే వెబ్ సిరీస్ లకే ఎక్కువ అలవాటు పడుతున్నారు నటులు. సెలబ్రిటీలందరూ వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెడుతున్నారు.

  • Share this:
    Hero Venkatesh: ప్రస్తుతం బుల్లితెర, వెండితెర కంటే వెబ్ సిరీస్ లకే ఎక్కువ అలవాటు పడుతున్నారు నటులు. సెలబ్రిటీలందరూ వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇక మరికొందరు స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు. నటించడానికి ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా మరో స్టార్ హీరో కూడా వెబ్ సిరీస్ వలలో చిక్కుకున్నాడు.

    టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే నారప్ప, దృశ్యం 2 సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే వెంకటేష్ కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది.

    వెంకటేష్ మహా దర్శకత్వంలో హీరో వెంకటేష్ ఓ సిరీస్ చేయనున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సిరీస్ ను వచ్చే ఏడాదిలో మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ను నిర్మించనుందట. ఇక డైరెక్టర్ వెంకటేష్ మహా ఎక్కువగా హ్యూమన్ ఎమోషన్స్ మీద ప్రభావం పడే కథలను ఎంచుకుంటాడట.

    ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ వెబ్ సిరీస్ కూడా అలాగే ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇక ప్రస్తుతం వెంకటేష్ మహా.. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో బిజీగా ఉన్నాడట. ఇక ఈ సినిమా ఈ ఏడాదిలో పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని తెలియగా.. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వెంకటేష్ వెబ్ సిరీస్ ను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
    Published by:Navya Reddy
    First published: