Home /News /movies /

Ram Charan - Upasana: రామ్ చరణ్ జీవితంలోకి మరో వ్యక్తి.. ముద్దులు, హగ్గులు ఇస్తూ ఉపాసనకు షాక్

Ram Charan - Upasana: రామ్ చరణ్ జీవితంలోకి మరో వ్యక్తి.. ముద్దులు, హగ్గులు ఇస్తూ ఉపాసనకు షాక్

Ram Charan - Upasana

Ram Charan - Upasana

Ram Charan - Upasana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Ram Charan - Upasana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితాన్ని గడపడానికి కూడా సమయం కేటాయిస్తారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చెర్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అయితే చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకున్నప్పటికీ తాజాగా తన కొత్త లవ్ తో వార్తల్లో నిలుస్తూ ఉపాసనకు గట్టి షాక్ ఇస్తున్నారని చెప్పవచ్చు.

    చెర్రీ ప్రేమలో పడ్డారంటే మరొక అమ్మాయితో ప్రేమలో పడ్డారనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. రామ్ చరణ్ తన ప్రేమను వ్యక్తపరుస్తుంది ఓ కుక్కపిల్ల పైన. తాజాగా రామ్ చరణ్ తన కుక్కపిల్లను అభిమానులకు పరిచయం చేశాడు. చెర్రీ తన కుక్కపిల్లకు రైమ్ అనే పేరు పెట్టినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన రైమ్ తో కలిసి దిగిన ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    ఇది కూడా చదవండి:కోర్టులో తేల్చుకుంటా.. విడాకుల వివాదంపై సమంత సంచలన వ్యాఖ్యలు

    ఈ ఫోటోలను చూస్తుంటే రైమ్ చెర్రీ ఎక్కడికి వెళ్లిన వదిలిపెట్టేలా అనిపించడం లేదని తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు మూగజీవాల పట్ల ఎంతో ప్రేమను పెంచుకుంటూ వాటితో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం తమన్నా, సమంత, రష్మిక, కీర్తి సురేష్ వంటి తారలు తమ పెట్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేస్తూ ఫోటోలను షేర్ చేశారు.

    ఇది కూడా చదవండి:మళ్లీ మొదటికి వచ్చిన కార్తీకదీపం.. వంటలక్క కష్టాలు పగవాడికి కూడా రాకూడదు దేవుడా

    తాజాగా చెర్రీ కూడా తన పెట్ రైమ్ ను అభిమానులకు పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చిత్రీకరణ పూర్తి కాగా కొరటాల శివ ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే
    Published by:Navya Reddy
    First published:

    Tags: Ram Charan, Rhymee, RRR, Tollywood, Upasana konidela

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు