Prabhas Radhe Shyam: ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా గురించి లీకైన టాప్ సీక్రెట్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Prabhas Radhe Shyam

Prabhas Radhe Shyam: టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్నది.

  • Share this:
    Prabhas Radhe Shyam: టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్నది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్, టీ సిరీస్ నిర్మాణంలో గోపి కృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద లు నిర్మిస్తున్నారు.

    ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా బాగా ఆకట్టుకుంది. రొమాంటిక్ పిరియాడికల్ ఎంటర్టైన్మెంట్ గా రానున్న ఈ సినిమాలో పూజ మెడికోగా పాత్రలో నటిస్తుందట. ప్రభాస్ ఓ ప్రమాదంలో చిక్కుకోగా ఆస్పత్రిలో చేరిన సమయంలో వీరి మధ్య పరిచయం పెరుగుతుందని వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరింత స్టోరీ లీక్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో టైటానిక్ మూవీనే దించారని తెలుస్తోంది.

    ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతుందని తెలియగా.. ఈ సినిమాలో సముద్రం షిప్ యాక్సిడెంట్ జరుగుతుందని.. అంతేకాకుండా సముద్ర ప్రయాణానికి సంబంధించిన ఎపిసోడ్ హైలెట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ పెద్ద షిప్ లో ప్రభాస్, పూజా హెగ్డే ప్రయాణం చేస్తున్న సమయంలో.. ప్రమాదం జరుగుతుందని, అక్కడి నుంచే కథను మలుపుతారని.. ఇది దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తుంది.
    ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమవ్వగా.. ఇప్పటివరకు వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం కొంత భాగం ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటు మరో వరుస సినిమాల్లో బిజీగా ఉండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ వంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
    Published by:Navya Reddy
    First published: