Mahesh Babu - Sridevi Soda Center: 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాపై మహేష్ బాబు ప్రశంసల వర్షం..

శ్రీదేవి సోడా సెంటర్‌పై మహేష్ బాబు ప్రశంసలు (Mahesh Babu)

Mahesh Babu - Sridevi Soda Center: శ్రీదేవి సోడా సెంటర్ (Mahesh Babu - Sridevi Soda Center) సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు. సుధీర్ బాబు (Sudheer Babu) అద్భుతంగా నటించారని.. ఆయన కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అంటూ మహేష్ మన్ననలు అందించారు.

  • Share this:
సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) జంటగా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కరుణ కుమార్ (Karuna Kumar) తెరకెక్కించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center). ఆగస్ట్ 27న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఉందిప్పుడు. సినిమా విడుదలైన రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రత్యేకంగా షో వేసుకొని చూశారు. తన ఇంట్లోని హోమ్ థియేటర్‌లో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చూసాడు సూపర్ స్టార్. ఆ తర్వాత ఈ సినిమాపై తన రివ్యూ కూడా ఇచ్చాడు. తాజాగా మరోసారి శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు. సుధీర్ బాబు అద్భుతంగా నటించారని.. ఆయన కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అంటూ మహేష్ మన్ననలు అందించారు. ఆడవాళ్ళంతా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అటు మహేష్ బాబు తెలిపారు. సినిమాలో హీరోయిన్ ఆనంది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని.. ఆమె నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు మహేష్ బాబు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో మహిళా ప్రాధాన్యత సన్నివేశాలు చాలా ఉన్నాయి అంటూ తెలిపారు మహేష్ బాబు.

మరీ ముఖ్యంగా సినిమాలో బోట్ సన్నివేశాల గురించి మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రేసింగ్ సీన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. సినిమాలో శ్యామ్‌దత్ సైనుద్దీన్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో పాటు జైలులో వచ్చే స్యాడ్ సాంగ్ లో ఫైట్ పెట్టడం అద్భుతమైన ఆలోచన అన్నారు మహేష్ బాబు. హీరోయిన్‌కు పెళ్లైపోయింది అని తెలిసినపుడు సుధీర్ బాబు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్.. ఆ పాట అన్నీ మరో స్థాయిలో ఉన్నాయన్నారు మహేష్ బాబు.

మణిశర్మ సంగీతం నెక్ట్స్ లెవల్‌లో ఉందని.. ఈ సినిమాకు ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రాణం అని తెలిపారు మహేష్ బాబు. ఈ సినిమాలో ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు సినిమాలో ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు మహేష్ బాబు. ఈ సినిమాను అందరూ చూసినపుడే దర్శకుడు చూపించిన విషయం.. చెప్పాలనుకున్న సందేశం ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని.. అందుకే ప్రతీ ఒక్కరూ శ్రీదేవి సోడా సెంటర్ చూడాలని కోరారు మహేష్ బాబు. తాజాగా హీరో సుధీర్ బాబు, నిర్మాతలు, దర్శకుడు ప్రత్యేకంగా వెళ్లి మహేష్ బాబును కలిశారు.

Sudigali Sudheer real name: జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అసలు పేరు ఎంతమందికి తెలుసు..?



సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా.. వ్యక్తిగతంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా యూనిట్ ను కలిసి తన అభినందనలు అందించారు మహేష్ బాబు. ఇలాంటి విభిన్నమైన సినిమాలు సుధీర్ బాబు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నారు. అలాగే చిత్రయూనిట్ ను కూడా ప్రత్యేకంగా అభినందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన ప్రశంసలతో శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయారు. మహేష్ బాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
Published by:Praveen Kumar Vadla
First published: