• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD STAR HERO JUNIOR NTR BIKE RIDES WITH HIS SON IN HYDERABAD ROADS NR

Jr NTR: కొడుకుతో హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఎన్టీఆర్!

Jr NTR: కొడుకుతో హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఎన్టీఆర్!

Jr NTR

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలు తీస్తూ టీవీ షోస్ చేస్తూ బిజీగా మారుతున్నప్పటికీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తుంటాడు తారక్.

  • Share this:
    Jr NTR: జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలు తీస్తూ టీవీ షోస్ చేస్తూ బిజీగా మారుతున్నప్పటికీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తుంటాడు తారక్. తన పిల్లలతో కలిసి పిల్లాడిలా మారి ఎంజాయ్ చేస్తుంటాడు ఎన్టీఆర్. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన కొడుకుతో హైదరాబాద్ నగరాల్లో చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కాడు. ఇంకేముంది ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

    కుమారులను మిస్ అవ్వకుండా ఉండేదుకు ప్రయత్నించే ఎన్టీఆర్.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వారితోనే గడుపుతుంటాడు. అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు సంబంధించిన ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు పంచుతుంటారు. కాస్ట్లీ బైక్ పై జూనియర్ ఎన్టీఆర్ తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ను బైక్ పై ఎక్కించుకొని వెళ్తున్నట్టు ఆ ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోను చుసిన ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

    కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో తెర మీదకు రానుంది. ఈ సినిమా అనంతరం కొరటాల శివతో తన 30వ సినిమాను చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాతో పాటు కెజిఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఒక ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలోగుసగుసలు వినిపిస్తున్నాయ్. మరో వైపు ఎన్టీఆర్ బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరుడు షో తో బుల్లితెర ప్రేక్షకులకు చెరువవ్వనున్నాడు ఎన్టీఆర్.
    Published by:Navya Reddy
    First published:

    అగ్ర కథనాలు