Home /News /movies /

TOLLYWOOD STAR HERO DAGGUBATI VENKATESH DAGUTHER DAGGUBATI AASHRITHA FOOD VLOG INFINITY PLATTER VIRAL NR

Daggubati Aashritha: నా ఇంటి పేరు వాడడం నాకు నచ్చదు.. హీరో వెంకీ కూతురు సింప్లిసిటీ?

Daggubati Aashritha

Daggubati Aashritha

Daggubati Aashritha: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్. ఇప్పటికీ సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈయన దగ్గుబాటి వారసుడు అన్న విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే.

    Daggubati Aashritha: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్. ఇప్పటికీ సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈయన దగ్గుబాటి వారసుడు అన్న విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఇదిలా ఉంటే ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉండగా అందులో తన పెద్ద కూతురు ఆశ్రిత ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. నిజానికి తన ఇంటి పేరు వాడకుండా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది.

    గత ఏడాది హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక రెడ్డిను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇన్ఫినిటీ ఫ్లాటర్ పేరుతో ప్రొఫెషనల్ బేకర్ గా అకౌంట్ ను మెయింటెన్ చేస్తుంది. ఈ అకౌంట్ ద్వారా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది.

    తన ఫుడ్ వ్లోగర్ గా వస్తానని ఎప్పుడు అనుకోలేదట. తనకు ఆహారం, ప్రయాణాలపై ఉన్న అభిరుచులతో ఈ రంగంలోకి వచ్చానని తెలిపింది. తన తండ్రి వెంకటేష్, పెద్దనాన్న సురేష్ బాబు ఇతర ఖండాలకు షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ రుచుల గురించి చెప్పడంతో అలా ఆ రుచులను ఆస్వాదించాలనే కోరిక వచ్చిందట. తను యూకేలో ఉన్నప్పుడు వంట రాదని ఆ తర్వాత చిన్నచిన్నగా చేయడంతో తన ఫ్రెండ్స్ కూడా రుచి చూసి ప్రోత్సహించేవారట.

    ఇక తనకు ఎక్కడ వండిన కూడా ఫోటో తీసుకునే అలవాటు ఉందట. వాటిని అందరితో పంచుకోవాడానికి బ్లాగ్ రాయలనుకుందట. అందుకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏర్పాటు చేసిందట. ఇక తను 'నైజెల్లా లాసన్' అనే మహిళ వీడియోలు ఎక్కువగా చూస్తుందట. ఇక తను ఎవరికీ తెలియదని.. ఫుడ్ పై ఆసక్తి చూపే వాళ్ళు తనను ఫాలో అయ్యేవారని తెలిపింది. తనకు తన ఇంటి పేరు వాడాలంటే ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది. కుటుంబ నేపథ్యం వల్లే తను ఇలా ఉందని అనుకుంటున్నారని.. అందుకే తన స్వయంకృషి నిరూపించడానికే ఇలా మొదలు పెట్టాను అని తెలిపింది.



    ఇంత పెద్ద కుటుంబం నుండి వచ్చినందుకు తనకు ఇదేం కష్టం కాదని తెలిపింది. నచ్చిన పని చేసుకోవడంలో ఆత్మసంతృప్తి ఉంటుందని పేర్కొంది. తన ఇంట్లో వాళ్లంతా తనకు ప్రోత్సహించారని, తన భర్త కూడా తన ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తారని తెలిపింది. ఇక తన తండ్రి వెంకటేష్ తనను ఎక్కువగా అర్థం చేసుకుంటాడని.. తను చేసిన పనిని చూసి గర్విస్తున్నానని అన్నప్పుడల్లా తెగ సంతోషంగా ఉంటుందని తెలిపింది ఆశ్రిత.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Daggubati Aashritha, Daggubati venkatesh, Food vlog, Infinity Platter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు