Tollywood Star Directors: సినీ ఇండస్ట్రీలో వేరే మార్గాల ద్వారా ఎంచుకునే కథలు కాకుండా.. సొంత ఆలోచనలతో కొన్ని కథలు తెరకెక్కిస్తారు డైరెక్టర్స్. అంతేకాకుండా కొందరు డైరెక్టర్స్ కి కొన్ని ప్రాజెక్టుల మీద మంచి మంచి డ్రీమ్స్ ఉంటాయి. వాటిపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంటారు. వాటి కోసం ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా ఇప్పటికి ఎంతో మంది డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్టులు ఉండగా.. ఇంతకీ వాళ్ళు ఎవరో, వాళ్ల ప్రాజెక్టులు ఏంటో చూద్దాం.
కృష్ణవంశీ దర్శకత్వంలో రుద్రాక్ష అనే సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని డిసైడ్ చేశాడు. అంతేకాకుండా ఈ సినిమాలో రమ్యకృష్ణ, అనుష్క, సమంతతో కూడా ప్లాన్ చేయగా.. మొత్తం బడ్జెట్ వల్ల ఈ సినిమా ఫైనల్ నిర్ణయానికి రాలేకపోయింది. ఇక మరో క్రేజీ డైరెక్టర్ రాజమౌళి కు మహాభారతం అనే సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలుమార్లు తెలిపాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత టాలెంటుతో పొలిటికల్ కాన్సెప్ట్ తో ఒక కథను తెరకెక్కించాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో జానీ సినిమా రిజల్ట్ వల్ల ఈ సినిమా టాపిక్ మళ్లీ రాలేదు.
ఇక గుణశేఖర్ దర్శకత్వంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా హిరణ్యకశ్యప. ఇక ఈ సినిమా హీరో రానా తో చేయాలని అనుకోగా.. ఇంకా షూటింగ్ ప్రారంభం అవ్వలేదు. ఇక కృష్ణవంశీ మరో క్రేజీ కథను ఎంచుకున్నాడు. రైతు అనే కథతో బాలకృష్ణతో తీయాలనుకున్నాడు. ఒక కీలకమైన పాత్రకు అమితాబచ్చన్ ఓకే అంటే ఈ సినిమాను చేయాలనుకున్నాడు నందమూరి బాలకృష్ణ. కానీ కొన్ని కారణాల వల్ల అమితాబ్ నో చెప్పగా ఈ సినిమా ఆగిపోయింది.
ఇక పూరీ జగన్నాథ్ జనగణమన అనే సినిమా చేయాలనుకున్నాడు. ఇక ఇప్పటి వరకి మళ్లీ ఈ సినిమా అప్ డేట్స్ ఏమి రాలేవు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో కలిసి కోబలి సినిమా చేయాలనుకున్నాడు. కానీ ప్రస్తుతం వేరే సినిమా లో బిజీగా ఉన్నాడు. ఇక సుకుమార్ మత్స్యకారుల నేపథ్యంలో ఓ సినిమా చేయనున్నాడు. కానీ దీనికి హిందీ చిత్రసీమ ల అంతర్జాతీయంగా మార్కెట్ కావడంతో ఈ సినిమా ముందుకు కదలలేక పోయింది.
ఇక క్రిష్ పర్వ అనే సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీయాలనుకున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ తెలియలేదు. ఇక రామ్ గోపాల్ వర్మ తన డ్రీమ్ ప్రాజెక్ట్ డీ కంపెనీ అని గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.