Vamshi Paidipally - Vijay: విజయ్ వంశీ పైడిపల్లి సినిమా.. స్క్రిప్ట్‌లో మార్పులు, రికార్డు రెమ్యూనరేషన్

Vamshi Paidipally - Vijay

Vamshi Paidipally - Vijay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు పూజా హెగ్డే జంటగా నటించినటువంటి మహర్షి సినిమాకు

  • Share this:
    Vamshi Paidipally - Vijay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు పూజా హెగ్డే జంటగా నటించినటువంటి మహర్షి సినిమాకు దర్శకత్వం వహించి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినందుకు గాను జాతీయ అవార్డును గెలుచుకున్న వంశీ తర్వాత ప్రాజెక్ట్ గురించి తెలియజేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

    తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న విజయ్ సినిమాలు తెలుగులో కూడా ప్రసారం అవుతూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. తాజాగా ఇతను నటించిన మాస్టర్ సినిమా తెలుగులో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ విధంగా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇంతవరకు ఏ ఒక్క సినిమా కూడా తెలుగులో పూర్తిగా నటించలేదు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో నటించాలని భావించారు.

    ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా పూర్తిస్థాయి తెలుగు చిత్రం తెరకెక్కబోతోంది. ప్రస్తుతం తెలుగు సినిమాతో పాటు తమిళంలో వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా విజయ్ వంశీ కాంబోలో ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

    అయితే ఈ సినిమా ఏ కథాంశం తెరకెక్కుతోంది? ఇందులో హీరోయిన్ ఎవరు? సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే విషయాల గురించి త్వరలోనే తెలియజేయునునట్లు చిత్రబృందం వెల్లడించారు. మొట్టమొదటిసారిగాపూర్తిస్థాయి తెలుగులో నటిస్తున్న విజయ్ ఈ సినిమా ద్వారా ఏ విధంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచిచూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నటించడం కోసం విజయ్ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
    Published by:Navya Reddy
    First published: