Vijay Devarakonda: మై హీరో.. లవ్ యూ.. విజయ్‌పై స్టార్ డైరెక్టర్ ప్రశంసలు

కచ్చితంగా సినిమాపై హైప్ పెంచడానికి లైగర్ సినిమాపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అర్థమవుతుంది. అసలు నిజాలు మాట్లాడుకుంటే తెలుగు, హిందీలో కలిపి లైగర్ దాదాపు 60 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay Devarakonda: ఫైటర్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫైటర్ మూవీని విడుదల చేసేందుకు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు.

  • Share this:
    'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్‌లో బీభత్సమై క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోలో లిస్ట్‌లో చేరిపోయాడు. కానీ ఆ తర్వాతే కాస్త ఒదిదుడుకులు మొదలయ్యాయి. గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలు హిట్ అయినా.. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు విజయ్. ప్రన్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఐతే తాజాగా జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. శాంటా క్యాప్ ధరించి జిమ్ చేశాడు. ఆ వీడియోను పూరీ జగన్నాథ్ షేర్ చేశాడు.

    'దటీజ్ మై హీరో. దటీజ్ మై ఫైటర్. నువ్వు నన్ను గర్వపడేలా చేశాడు. ఐ లవ్ యూ విజయ్' అని ట్వీట్ చేశాడు పూరీ. కిస్ ఎమోజీని జోడించి విజయ్‌ దేవరకొండపై ప్రశంసలు కురిపించాడు.



    ఈ వీడియోను చూస్తే.. ఫైటర్ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. అందుకోసమే విజయ్ వర్కవుట్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఫైటర్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫైటర్ మూవీని విడుదల చేసేందుకు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు.
    Published by:Shiva Kumar Addula
    First published: