Anchor Suma Kanakala Ravi: తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాంకర్స్‌లో రవి కూడా ఉంటాడు. అలాగే సుమ కనకాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కులదేవత అన్నట్లు యాంకర్స్ అందరికీ ఈమె కులదైవం అంతే. క్రికెట్‌కు సచిన్.. సినిమాలకు చిరంజీవి..
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాంకర్స్‌లో రవి కూడా ఉంటాడు. అలాగే సుమ కనకాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కులదేవత అన్నట్లు యాంకర్స్ అందరికీ ఈమె కులదైవం అంతే. క్రికెట్‌కు సచిన్.. సినిమాలకు చిరంజీవి.. అలాగే బుల్లితెర యాంకరింగ్‌కు సుమ.. ఈ మూడు ఫిక్స్ అంతే. అలా ఉండిపోయింది సుమ. పాతికేళ్ళ కెరీర్లో ఆమెతో పాటు వచ్చిన వాళ్లంతా ఇప్పుడెక్కడున్నారో కూడా తెలియదు. కానీ సుమ మాత్రం ఇప్పటికీ నెంబర్ వన్‌గానే ఉంది.. ఉండేలా ఉంది కూడా. మరోవైపు మేల్ యాంకర్స్‌లో ప్రదీప్‌తో పాటు తన సత్తా కూడా చూపిస్తున్నాడు రవి. మధ్యలో హీరోగా ట్రై చేసినా.. అది మన గ్రౌండ్ కాదని తెలుసుకుని వచ్చి బుల్లితెరపై బిజీ అయ్యాడు ఈయన. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరూ యాంకరింగ్ కాకుండా మరో కొత్త టాలెంట్ కూడా చూపించారు. అసలు విషయం ఏంటంటే సుమ, రవి కలిసి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే కార్యక్రమం చేస్తున్నారు. జీ తెలుగులో వచ్చే ఈ షోకు మంచి రేటింగ్స్‌తో పాటు రెస్పాన్స్ కూడా వస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అదిరిపోయే టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించి.. తీసుకొచ్చి ఇందులో పర్ఫార్మ్ చేయిస్తున్నారు. అందులో భాగంగానే ఈ వారం ప్రోమో విడుదల చేసారు. అందులో రవి, సుమ కొత్త టాలెంట్ చూపించారు. అదే వాళ్ల సింగింగ్ టాలెంట్. ఇదివరకే ఓ సినిమాలో కూడా పాడింది సుమ.
తన తోటి యాంకర్ అనసూయ భరద్వాజ్ చిందేసిన సూయ సూయ పాట పాడింది సుమే. అప్పట్లో తమన్ ఆమెతో పాడించాడు. అయితే యాంకర్ రవి మాత్రం పాడినపుడు ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరూ కలిసి పాట పాడారు. అది కూడా కే విశ్వనాథ్ గారి సువ్వి సువ్వి సువ్వాలమ్మా పాట. అటు రవి.. ఇటు సుమ ఇద్దరూ పోటీ పడి పాడిన ఈ పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది. యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.