తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ అనే మాట వినగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ కనకాల. ఆమె మాటల తుఫాన్ ముందు ఏ యాంకర్ కనీసం నిలబడటం లేదు. అలాంటిది ఆమెకు యాంకరింగ్ బాధలేంటి.. అందరికీ కూర్చోబెట్టి కోచింగ్ ఇచ్చేంత అనుభవం ఉంది.. పైగా దశాబ్ధానికి పైగా ఇదే ఫీల్డులో ఉంది కదా అలాంటప్పుడు బాధలేంటి అనుకుంటున్నారు కదా.. కానీ నిజంగానే సుమ మాత్రం యాంకరింగ్‌లో చాలా తంటాలు పడింది. నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. అయితే ఇప్పుడు మాత్రం కాదు. కెరీర్ కొత్తలో చాలా కష్టపడింది సుమ. నిజానికి యాంకరింగ్ అనే పదానికి నిదర్శనంగా ఉండే సుమ.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్ని బాధలు పడిందో.. తన ప్రయాణం ఎలా నడిచిందో అభిమానులతో పంచుకుంది.
అసలు తాను కెరీర్ మొదలు పెట్టినప్పుడు యాంకరింగ్ అనే పదమే లేదని చెప్పింది సుమ. అప్పట్లో యాంకర్స్‌ను అనౌన్సర్స్ అని పిలిచేవారని చెప్పుకొచ్చింది. అనౌన్స్ చేస్తారు కాబట్టి అనౌన్సర్స్ అని పిలిచే వాళ్లని.. అలాంటి పదం మాత్రమే ఉండేదని చెప్పుకొచ్చింది ఈమె. సుమ ఇప్పుడంటే అన్ని ఛానెల్స్‌లో కనిపిస్తుంది కానీ అప్పట్లో దూరదర్శన్‌లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసింది సుమ. అప్పుడు మాత్రం ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు ‘ఇక్కడ మాట్లాడాలమ్మా’ అని మాత్రమే చెప్పేవాళ్లు.. అలా సుమ వాళ్ల మాటలను ఫాలో అయిపోయేదాన్నని చెప్పింది. తనకు ఫలానా వ్యక్తి యాంకరింగ్‌లో స్ఫూర్తి అని లేరని క్లారిటీ ఇచ్చింది ఈ స్టార్ యాంకర్.
ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి యాంకర్స్ అంతా సుమను తమ కులదైవం అంటూ ఆట పట్టిస్తుంటారు. ఇక సుమ కూడా పాత రోజులను గుర్తు చేసింది. జెమినీలో తాను యాంకరింగ్ చేసిన మొదటి కార్యక్రమం ‘వన్స్ మోర్ ప్లీజ్’ అని తెలిపింది సుమ. అప్పట్నుంచి తనకు గుర్తింపు వచ్చిందని.. అయితే తనను స్టార్ యాంకర్‌గా మార్చేసింది మాత్రం ‘మహిళలూ... మహారాణులు’ అని తెలిపింది సుమ. ఆ తర్వాత అదే షోను స్టార్ మహిళగా మార్చేసారని చెప్పింది.
12 ఏళ్ల పాటు సాగిన ఒకే ఒక్క మహిళా కార్యక్రమంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది ఈ కార్యక్రమం. ఇక తెలుగులో తాను ఇంత చక్కగా మాట్లాడటానికి కారణం తన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అని చెప్పింది సుమ. కెరీర్ మొదట్లో తనకు ‘బాధ’ అనే పదం అనడానికి సమస్యగా ఉండేదని.. దాన్ని బాద అని పిలిచేదాన్నని చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో తన దర్శకులు తనకు హెల్ప్ చేసారని.. అది బాధ అంటూ పలకాలని చెప్పినట్లు గుర్తు చేసుకుంది సుమ. అలా తనకు కెరీర్ మొదట్లో యాంకరింగ్ బాధలు చాలానే ఉండేవని సరదాగా చెప్పుకుంది ఈ స్టార్ యాంకర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood