Anchor Suma: స్టార్ యాంకర్ సుమ కనకాల పాతికేళ్ల కింద ఇలా ఉండేది..!

యాంకర్ సుమ ఫోటోస్ (Anchor Suma)

Suma Kanakala: సుమ కనకాల.. పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా..

  • Share this:
సుమ కనకాల.. పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఈమెను ఫీల్ అవుతుంటారు అంతా. సుమ కూడా అలాగే అందరిని నవ్విస్తుంటుంది. సరదాగా ఉంటుంది కాబట్టే ఇప్పటి వరకు ఈమెకు తిరుగులేదు.. ఈమె లాంటి యాంకర్ మళ్లీ తెలుగులో వస్తుందా రాదా అనేది కూడా అనుమానమే. ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాల ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. ఝాన్సీ, ఉదయభాను లాంటి వాళ్లు యాంకర్‌లుగా ఉన్నపుడు సుమ సినిమాలతో బిజీగా ఉంది.. మధ్యలో కొన్ని సీరియల్స్ కూడా చేసింది. అప్పట్లో దిగిన ఫొటోషూట్ ఇప్పుడు ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ మధ్య తన సోషల్ మీడియా పేజీలో అభిమానులతో పంచుకుంది సుమ. పెళ్లికి ముందు.. సీరియల్స్ చేసే సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసింది ఈ సీనియర్ యాంకర్. అందులో చాలా అందంగా.. హీరోయిన్ మాదిరే ఉంది సుమ.

suma kanakala,suma kanakala twitter,suma kanakala instagram,suma kanakala rare photos,suma kanakala old photos,suma kanakala facebook,suma kanakala videos,suma kanakala pulihora,suma kanakala sri rama navami pulihora,suma kanakala sumakka channel,suma kanakala you tube channel,telugu cinema,సుమ,యాంకర్ సుమ,యాంకర్ సుమ పులిహోర,యాంకర్ సుమ పాత ఫోటోలు
యాంకర్ సుమ ఫోటోస్ (Anchor Suma)


అప్పట్లో చాలా సినిమాలలో సుమకు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఆమెకు మాత్రం హీారోయిన్ అవ్వాలని.. స్టార్ అయిపోవాలనే ఆలోచన లేదు. అందుకే కొన్ని మంచి అవకాశాలు వచ్చినా కూడా కేవలం సీరియల్స్ వైపు అడుగులేసింది. దాంతో పాటు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది సుమ కనకాల.

యాంకర్ సుమ రేర్ ఫోటో (anchor suma old photo)
యాంకర్ సుమ రేర్ ఫోటో (anchor suma old photo)


నిజానికి అప్పట్లో 1996లో దాసరి తెరకెక్కించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది కూడా. ఆ తర్వాత సీరియల్స్.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది. ఈమె పాత ఫోటోను చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: