Home /News /movies /

TOLLYWOOD STAR ANCHOR KISSED SHEKAR MASTER ON STAGE VIDEO GOES VIRAL AND NETIZENS TROLLING NR

Anchor Sreemukhi: మళ్లీ అదే తప్పు చేసిన శ్రీముఖి.. ఎందుకు అంత అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు!

Anchor Sreemukhi

Anchor Sreemukhi

Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వాళ్ళేవరు లేరు. బుల్లితెరలో ఎన్నో షోల్లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. అంతే కాకుండా తన గ్లామర్ తో అందరిని ఫిదా చేస్తుంది.

ఇంకా చదవండి ...
    Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వాళ్ళేవరు లేరు. బుల్లితెరలో ఎన్నో షోల్లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. అంతే కాకుండా తన గ్లామర్ తో అందరిని ఫిదా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను, డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. ఇక ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే మళ్లీ ఓ తప్పు చేసి విమర్శలు ఎదుర్కొంటుంది శ్రీముఖి.

    అదుర్స్ అనే షో తో బుల్లితెరలో అడుగుపెట్టిన శ్రీముఖి అంతకుముందే వెండితెరపై అడుగు పెట్టింది. ఇక ఈ షో తర్వాత యాంకర్ రవితో కలిసి పటాస్ షో లో యాంకరింగ్ చేసి బాగా రచ్చ చేసింది. ఇక ఇందులో తన మాటలు, తీరుపట్ల కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. వెండితెర, బుల్లితెర ఈవెంట్లలో కూడా హోస్టింగ్ తో బాగా సందడి చేస్తుంది. ఇక ఈ మధ్య వరుస ఈవెంట్ లతో బాగా బిజీగా ఉంది శ్రీముఖి.

    తాజాగా 'కామెడీ స్టార్స్' షో కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా.. అందులో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీముఖి స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శేఖర్ మాస్టర్ జడ్జిగా చేస్తున్నాడు. ఇక ఇందులో కూడా శ్రీముఖి శేఖర్ మాస్టర్ తో డాన్స్ చేస్తూ బాగా రెచ్చిపోయింది. పైగా అతనికి ముద్దు పెట్టి అందరూ షాక్ అయ్యేలా చేసింది. గతంలో కూడా ఓ షోలో శ్రీముఖి శేఖర్ మాస్టర్ కి వేదికపైనే ముద్దు పెట్టి బాగా హల్ చల్ చేసింది. దాంతో నెటిజన్లు తనపై బాగా విమర్శలు చేశారు.



    ముక్కు అవినాష్ శ్రీముఖి గెటప్ వేసుకొని.. 'మొన్న నేను మీకు పెట్టిన ముద్దు మొత్తం వైరల్ అయ్యింది తెలుసా' అని శ్రీముఖి లాగా అనడంతో.. వెంటనే శేఖర్ మాస్టర్.. 'ఆ ముద్దు సీన్ తర్వాత మా ఇంట్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చింది తెలుసా' అని కామెంట్ చేశాడు. ఇక ప్రోమో వైరల్ గా మారగా.. శ్రీముఖి మళ్లీ రెండోసారి అదే తప్పు చేయడంతో ఈసారి ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. పైగా ఇలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anchor Sreemukhi, Comedy stars, Shekar master, Star Maa, Tollywood

    తదుపరి వార్తలు