హోమ్ /వార్తలు /సినిమా /

Shruthi Hassan - Akshara Hassan:చెల్లి అక్షర దర్శకత్వంలో నటిస్తా.. శృతిహాసన్ కీలక వ్యాఖ్యలు!

Shruthi Hassan - Akshara Hassan:చెల్లి అక్షర దర్శకత్వంలో నటిస్తా.. శృతిహాసన్ కీలక వ్యాఖ్యలు!

Shruthi Hassan - Akshara Hassan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ పరిచయం గురించి అందరికి తెలిసిందే. ఇక వరుస అవకాశాలతో బిజీగా ఉన్న శృతిహాసన్ ఈ మధ్య వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.

  Shruthi Hassan - Akshara Hassan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ పరిచయం గురించి అందరికి తెలిసిందే. ఇక వరుస అవకాశాలతో బిజీగా ఉన్న శృతిహాసన్ ఈ మధ్య వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది. ముక్కుసూటి అమ్మాయిగా ఓ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలతో పాటు తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

  ఇదిలా ఉంటే కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా లో చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగులు వాయిదా పడగా ఇంట్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా బాగా బిజీ గా మారింది. ఇదిలా ఉంటే తన చెల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తానంటుంది శృతిహాసన్.

  తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు స్పందించగా.. తన చెల్లెలు అక్షర హాసన్ కు దర్శకత్వం రంగంలో రాణించాలనే కోరిక ఉందని తెలిపింది. ఇక ఆమె దర్శకత్వం వహిస్తే తనకు సరిపడా కథ అందిస్తే తప్పకుండా తన దర్శకత్వంలో నటిస్తానని తెలిపింది శృతి. ఇక కమల్ హాసన్, సారిక 1980లో ప్రేమ పెళ్లి చేసుకోగా 1986లో శృతిహాసన్ జన్మించింది. 1991లో రెండవ కూతురు అక్షర హాసన్ జన్మించింది. కాగా కమల్ హాసన్, సారిక 2004లో విడిపోయిన సంగతి తెలిసిందే.

  First published:

  Tags: Kamal hassan, Shruthi hassan, Sister akshara hassan, Tamil films, Telugu films, Tollywood, అక్షర హాసన్, కమల్ హాసన్, టాలీవుడ్, శృతి హాసన్

  ఉత్తమ కథలు