• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD STAR ACTRESS ANUSHKA SHETTY SAYS SHE IS A HUGE FAN OF BITHIRI SATHI PK

అనుష్క మనసు దోచేసిన ఆ ఒక్కడు.. బయట పెట్టిన స్వీటీ..

అనుష్క మనసు దోచేసిన ఆ ఒక్కడు.. బయట పెట్టిన స్వీటీ..

సూపర్ సినిమా నుంచి నిన్నటి సైరా వరకు ఎన్నో సంచలన సినిమాలు చేసింది అనుష్క. ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాలకు చేరువగా నటించింది ఈ ముద్దుగుమ్మ.

Anushka Shetty: తెలుగు ఇండస్ట్రీలో అనుష్కకు అభిమానులు ఎంతమంది ఉన్నారనేది ప్రత్యేకంగా లెక్కలు అవసరం లేదు. కోట్లలో అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరి అభిమాని తెలుసా..?

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో అనుష్కకు అభిమానులు ఎంతమంది ఉన్నారనేది ప్రత్యేకంగా లెక్కలు అవసరం లేదు. కోట్లలో అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరి అభిమాని తెలుసా..? ఇప్పుడు తెలిసింది.. హీరోల విషయంలో పక్కనబెడితే బుల్లితెరపై మాత్రం అనుష్క ఓ నటుడికి పడిపోయింది. ఎంతోమంది అభిమానులు వెళ్లి అనుష్కతో నేను మీ ఫ్యాన్ అని చెప్పాలనుకుంటారు.. కానీ అలాంటి అనుష్క వచ్చి ఒకరితో నేను మీ అభిమాని అని చెప్పింది. అరుంధతి, భాగమతి, రుద్రమదేవి, బాహుబలి ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ జేజమ్మ.. బుల్లితెరపై బిత్తిరి సత్తి చేసే పనులకు ఫ్యాన్ అయిపోయింది.
అనుష్క బిత్తిరి సత్తి (anushka bithiri sathi)
అనుష్క బిత్తిరి సత్తి (anushka bithiri sathi)

వి6 ఛానెల్ నుంచి ఫేమస్ అయి.. ఇప్పుడు టీవీ 9లో శివజ్యోతితో కలిసి ఇస్మార్ట్ వార్తలు చేస్తున్న కమెడియన్ బిత్తిరి సత్తి అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది ఈమె. ఒక్కరి ముందు కాదు.. వేల మంది చూస్తున్న టీవీ ప్రేక్షకుల ముందే చెప్పింది. అలా మనసులో మాట చెప్పాలన్నా కూడా గొప్ప మనసు కావాలి.. అనుష్కకు అలాంటి భేషజాలు లేవు.. తాజాగా ఉగాది వేడుక కోసం జీ తెలుగు పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసింది.
అనుష్క బిత్తిరి సత్తి (anushka bithiri sathi)
అనుష్క బిత్తిరి సత్తి (anushka bithiri sathi)

మార్చి 22న ఇది ప్రసారం కానుంది. అందులో అనసూయ, రవి, నాగబాబు, తరుణ్ మాస్టర్ ఇలా ఎంతోమంది వచ్చారు. అందులో బిత్తిరి సత్తి కూడా వచ్చాడు. ఇందులో భాగంగానే బిత్తిరి సత్తిని నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పింది అనుష్క. ఆ తర్వాత అనుష్కపై ఓ పేరడీ సాంగ్ పాడాడు సత్తి. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: