హోమ్ /వార్తలు /సినిమా /

Sharwanand: రెమ్యూనరేషన్ విషయంలో శర్వానంద్ గొడవ.. అసలు నిజం ఏమిటంటే..?

Sharwanand: రెమ్యూనరేషన్ విషయంలో శర్వానంద్ గొడవ.. అసలు నిజం ఏమిటంటే..?

Sharwanand

Sharwanand

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. 2003 ఐదో తారీఖు సినిమాతో వెండితెర పరిచయమైన శర్వానంద్ ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించాడు.

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. 2003 ఐదో తారీఖు సినిమాతో వెండితెర పరిచయమైన శర్వానంద్ ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక గమ్యం సినిమాతో తెలుగు, తమిళంలో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక అలా వరుస సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కొన్ని సినిమాలతో ప్లాఫ్ లు అందుకోగా తన నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే శర్వానంద్ కు రెమ్యునరేషన్ విషయంలో ఓ వివాదం ఎదురైనట్లు తెలుస్తుంది.

ఈమధ్య వరుస సినిమాలో అవకాశాలు అందుకున్న శర్వానంద్ ఈ ఏడాది శ్రీకారం సినిమాతో ముందుకొచ్చాడు. బి కిషోర్ దర్శకత్వంలో మార్చి 11న విడుదలైన సినిమా శ్రీకారం. ఇక ఇందులో శర్వానంద్, ప్రియాంక అరుణ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ అచంట, గోపీచంద్ అచంట ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

వ్యవసాయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి కథ నేపథ్యంతో తెరకెక్కగా అంత సక్సెస్ ను అందుకోలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో రెమ్యూనరేషన్ విషయంలో కొన్ని నోటీసులు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలకు కాస్త నష్టం జరుగగా.. సినిమా విడుదల తర్వాత ఇస్తామని శర్వానంద్ కు రెమ్యూనరేషన్ ను నిర్మాతలు పెండింగులో పెట్టారని తెలిసింది. దీంతో ఇప్పటివరకు నిర్మాతల నుండి ఈ విషయం గురించి ఎటువంటి స్పందన లేకపోవడంతో శర్వానంద్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి శర్వానంద్, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

First published:

Tags: Remuneration, Sharwanand, Srikaram film, Srikaram movie, Tollywood, శర్వానంద్

ఉత్తమ కథలు