ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా మంచు వారబ్బాయి..?

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్‌తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తైన వెంటనే మరో మూడు సినిమాలు వేచి చూస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు...

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 5, 2020, 9:56 PM IST
ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా మంచు వారబ్బాయి..?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్‌తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తైన వెంటనే మరో మూడు సినిమాలు వేచి చూస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు కూడా కమిట్‌మెంట్ ఇచ్చేసాడు తారక్. వాళ్ళిద్దరితో పాటు అట్లీ కుమార్ కూడా లైన్‌లోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పూర్తైన వెంటనే త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు ఈయన. ఈ చిత్రంలో కాస్టింగ్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మాటల మాంత్రికుడు. ముఖ్యంగా హీరోయిన్ దగ్గర్నుంచి విలన్స్ వరకు అందర్నీ చాలా టైమ్ తీసుకుని మరీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)


ఈ క్రమంలోనే ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం మోహన్ లాల్‌ను తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు మరో వార్త కూడా బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మంచు మనోజ్ నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్‌కు బెస్ట్ ఫ్రెండ్ మంచు మనోజ్. ఇద్దరూ 1983, మే 20న పుట్టారు.. చిన్నప్పటి నుంచి కూడా కలిసే పెరిగారు. ప్రాణ స్నేహితులు.. పైగా మనోజ్ ఎప్పుడూ తారక్‌కు బౌన్సర్ మాదిరే ఉంటాడు. ఇలాంటి స్నేహితుడు ఇప్పుడు జూనియర్ కోసం విలన్ అవుతున్నాడని ప్రచారం అయితే బాగానే జరుగుతుంది.
మంచు మనోజ్, ఎన్టీఆర్ (Manchu Manoj NTR)
మంచు మనోజ్, ఎన్టీఆర్ (Manchu Manoj NTR)

మంచు మోహన్ బాబు వారసత్వంగా సినిమాల్లోకి ఆడుగుపెట్టినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోగా మాత్రం ఎదగలేదు మనోజ్. తాజాగా మూడేళ్లు గ్యాప్ తీసుకుని అహం బ్రహ్మస్మి సినిమాతో వస్తున్నాడు మనోజ్. ఈ క్రమంలోనే తన సినిమాలో విలన్ పాత్ర కోసం మనోజ్ అయితే బాగుంటాడని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. సంజయ్ దత్‌తో పాటు మరికొందరు స్టార్స్ పేర్లు వినిపించిన తర్వాత చివరికి ఇప్పుడు మనోజ్ అయితే కొత్తగా ఉంటుందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ పాత్ర చేయడానికి మంచు వారబ్బాయి ఒప్పుకుంటాడా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందిప్పుడు.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)

త్రివిక్రమ్ సినిమాలో కొన్ని సినిమాలు మినహా అన్నింట్లోనూ విలన్ అంటే చాలా స్టైలిష్‌గా ఉంటాడు. అలాంటి పాత్రే వస్తే మంచు మనోజ్ ఒప్పుకుంటాడేమో.. ఎందుకంటే కెరీర్‌లో కొత్తదనం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు మనోజ్. దాంతో త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తనకోసం పర్ఫెక్ట్ పాత్ర రాస్తే కచ్చితంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా అక్కడున్నది ప్రాణ స్నేహితుడు ఎన్టీఆర్. మరి చూడాలిక.. ఈ కాంబినేషన్ కలిస్తే మాత్రం మరో సంచలనమే అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 5, 2020, 9:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading